మహబూబ్‌నగర్

కల్వకుర్తిలో జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, నవంబర్ 12: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు మరో కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయని, కురుక్షేత్రంలో రథసారధి కృష్ణుడు అయితే కేసీఆర్ రథసారధిగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, త్వరలో జరగనున్న ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గంలో జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని సాయిబాలాజీ పంక్షన్ హాలులో పుర పాలక సంఘం చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఎడ్మా కిష్టారెడ్డిలు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్ లు ముఖ్య అతిథులుగా హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నీతికి అవినీతికి మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతిపక్ష నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని, 60 ఎండ్లు రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధి నిరోదకులుగా మరారని టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ విమర్శించారు. కెఎల్‌ఐ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పుర పాలక సంఘం వైస్ చైర్మన్ షాహెద్, మండల ఉపాధ్యక్షుడు పర్వతాలు, సింగిల్ విండో వైస్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి, తలకొండపల్లి మాజీ ఎంపిపి శ్రీనివాస్‌యాదవ్, కౌన్సిలర్ సూర్యప్రకాష్‌రావు, మక్బుల్, గుమ్మకొండరాజు, విజయ్‌గౌడ్, పుల్లయ్య, ఖలీల్, గోవర్థన్, యడ్మ సత్యం, జైపాల్, మాదవయ్య, నర్సింహ్మ, బనే్న శ్రీను, జగదీష్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.