మహబూబ్‌నగర్

భారీ భద్రత నడుమ కురుమూర్తి ఆభరణాల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, నవంబర్ 12: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ కొండల్లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తిస్వామి ఆభరణలను ఎస్‌బీ ఐ బ్యాంకు లాకర్ నుంచి సోమవారం ఆత్మకూర్ సీ ఐ బండారు శంకర్ ఆధ్వర్యంలో భారీ భద్రతనడుమ కురుమూర్తిస్వామి దేవాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ ఎస్‌బీ ఐ లాకర్ లో ఉంచిన ఆభరణలకు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం పట్టణానికి గాడి వంశీయుల కుటుంబ సభ్యుల తో పాటు మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి లాకర్ లో ఉంచిన కురుమూర్తిస్వామి ఆభరణలకు వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి పరమేశ్వరస్వామి చెరువుకట్ట వరకూ ఊరెగింపు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే కురుమూర్తి జాతర అనంతరం ఆభరణలను ఇక్కడి ఎస్‌బీ ఐ బ్యాంకు లాకర్ లో ఉంచడం అనవాయితీ కాగా బ్రహ్మోత్సవాలలో బాగమైన ఉద్దాల ఉత్సవానికి ముందు లాకర్ ఉన్న ఆభరణలకు పట్టాణానికి చెందిన గాడి వంశీయులతో పాటు మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలతో పాటు అమరచింత మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి, టీ ఆర్ ఎస్ నాయకులు జలేంధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు డోకురు పవన్‌కుమార్‌రెడ్డి, జి మధుసుధన్‌రెడ్డి, బీజేపీ నాయకులు బీ కొండయ్య, వర్కటం జగన్నాథ్‌రెడ్డి, తెలుగుయువత నాయకులు సిద్దర్థారెడ్డి, ఆత్మకూర్ ఎంపిపి శ్రీధర్‌గౌడ్ తదితర ప్రముఖులు పూజ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆభరణలతో ఊరెగింపు నిర్వహించగా ఆత్మకూర్ సీ ఐ బండారు శంకర్ ఆధ్వర్యంలో నలుగురు సీ ఐ లతో పాటు ఆరు మంది ఎస్సై లు పెద్ద ఎత్తున పోలీసులతో పటిష్ట భద్రతనడుమ కురుమూర్తిస్వామి దేవాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గాడి క్రిష్ణామూర్తి, గాడి లక్ష్మీనారయణ, బంగారు శ్రీనువాసులు, బాస్కర్, యంపిటీసీ లు గాయిత్రీ, వెంకటానర్సు, ఆశ్వీన్‌కుమార్ పాల్గొన్నారు.