మహబూబ్‌నగర్

దేవరకద్రలో రెండవ రోజు ఒక్క నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, నవంబర్ 13: ఈనెల 12 తేదీన సోమవారం నామినేషన్లు వేసేందుకు ప్రారంభం కావడంతో మొదటి రోజు నామినేషన్లు ఎవరు వేయలేదు దీంతో మంగళవారం రోజు వైఎస్‌అర్‌సీపీ అభ్యర్థిగా దమగ్నపూర్ చెందిన కెటి నరసింహారెడ్డి నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతకుమారికి అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నియోజవర్గంలో రైతుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని, ఈ ప్రాంతవాసిగా సమస్యలు అన్ని తెలసునని, ఈప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు నావంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
అంతకు ముందు ఎన్నికల అధికారి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. అభ్యర్థుల వెంట నలుగురు లేదా ఐదుగురు మాత్రమే నామినేషన్ల హాల్‌ల్లోకి అనుమతి ఉంటుందని లేకుంటే అంతకు మించి హల్‌లోకి వెళ్లేందుకు చూస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని ఎన్నికల అధికారి వసంతకుమారి తెలిపారు. పోలీస్ డీఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ ర్యాలీ ద్వారా నామినేషన్ వేసే వారు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలన్నారు. లేకుంటే నిబందనాల ప్రకారం చర్యలుంటాయని వారు తెలిపారు.