మహబూబ్‌నగర్

మహాకూటమి నుండి నేడు నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, నవంబర్ 13: మహాకూటమి నుండి బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ అరుణ శ్రీనివాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా అధిష్ఠానం ఎవరికీ టిక్కెటు కేటాయించలేదని, మక్తల్ నుండి భర్త దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నియోజక వర్గం నుండి తాను ఒకేసారి నామినేషన్ దాఖలు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మేస్ర్తి శ్రీనివాసులు, సుదమదుసూదన్‌రెడ్డి, భరత్‌భూషన్, సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు తొలి నామినేషన్ దాఖలు
గద్వాల, నవంబర్ 13: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండోరోజు నామినేషన్ల పర్వం ముగిసింది. గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మంగళవారం గద్వాల నియోజకవర్గానికి గోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి నామినేషన్ పత్రాలు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా సంయుక్త కలెక్టర్ జె.నిరంజన్‌కు సమర్పించారు. కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన సావిటికాడి తిమ్మారెడ్డి ప్రథమ కుమారుడు గోపాల్‌రెడ్డి పాలిటెక్నిక్ డిప్లమో వరకు విద్యనభ్యసించారు. 2009, 2014 గద్వాల అసెంబ్లీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో సారి కూడా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం విశేషం.