మహబూబ్‌నగర్

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల ప్రచారం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 13: చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున కూటమి అంటూ ఏర్పడిన దొంగలు ముఠా తరపున తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. మంగళవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి, వేపూర్, లింగన్నపల్లి, గొండ్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొండ్యాలలో నిర్వహించిన రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కరెంట్ కావాలని అడిగితే రైతులను కాల్చిన వారు నేడు మళ్లీ తెలంగాణ పల్లెల్లోకి వస్తున్నారని 24 గంటల నిరంతరం కరెంట్ ఇస్తున్న వారు ఒకవైపు, ఇంకో వైపు కరెంట్ కోసం ప్రజలను కష్టాల పాలు చేసిన వారు మరోవైపు ఉన్నారని తెలిపారు. తెలంగాణకు చంద్రబాబు కరెంట్ కట్ చేస్తే కేసీఆర్ దాన్ని సవాలు గా తీసుకుని 24 గంటలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్ది, బాబుకు బుద్ధి చెప్పారని అన్నారు. మహాకూటమి పేరిట తెలుగదేశం పార్టీ నాయకులు, ఆంధ్ర పెత్తందారులు మళ్లీ తెలంగాణను నష్టం చేయడానికి పూనుకుని వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణలో నేరుగా తిరిగే దమ్ముధైర్యం లేక ముఖం చాటేసిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తిరిగితే అసలు సంగతి తేలుతుందని, ఆయన సంగతేమితో మరోసారి తెలంగాణ ప్రజల రుచి చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అమరావతికి బానిసలుగా మారారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బులు పంపిస్తే ఇక్కడి టీడీపీ సన్యాసులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వారికి నేరుగా పోటీ చేసే దమ్ములేదని విమర్శించారు. ప్రాణాలను తెగించి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేతకాక చంద్రబాబుతో జతకట్టి ఉన్న విలువ పోగొట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో వెనకకు నెట్టివేసిన పాలమూరు జిల్లాకు సాగునీరు కృష్ణా జలాలను తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతి పేదవాడికీ టీఆర్‌ఎస్ అండగా ఉందని పేదలు అభివృద్ది చెందుతుంటే జీర్జించుకోలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులను ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఎప్పటికి తెలంగాణకు వ్యతిరేకమని అన్నారు. ఈ రోడ్‌షోలో తెరాస నాయకులు లక్ష్మయ్య, బాలయ్య, కృష్ణయ్యగౌడ్, కృష్ణార్జున్, జంబులయ్య, పెద్దచెన్నయ్య, రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మాటల మనిషిని కాను.. చేతల మనిషిని
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బాలానగర్, నవంబర్ 13: ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నేరవేర్చి ప్రజల సమస్యలను తీర్చానని, తాను మాటల మనిషిని కానని చేత మనిషినని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం బాలానగర్ మండల పరిధిలోని వీరన్నపల్లి, ఈదమ్మగడ్డతాండ, మోతిఘనపూర్, నందారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపర్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయన పేర్కోన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సాయికృష్ణ, నరసింహులు, మైపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.