మహబూబ్‌నగర్

కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 13: మహాకూటమిలో సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. జిల్లాలో రెండు స్థానాలను తెలగుదేశం పార్టీకి కేటాయించారు. మహబూబ్‌నగర్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తూ మహాకూటమిలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, మక్తల్ నియోజకవర్గానికి టీడీపీ సినియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. అదేవిధంగా మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గద్వాల నియోజకవర్గానికి మాజీ మంత్రి డీకె అరుణ, అలంపూర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, వనపర్తికి చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ నాగం జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట వంశీకృష్ణ, కల్వకుర్తి వంశీచంద్‌రెడ్డి, జడ్చర్ల డాక్టర్ మల్లురవి, కొడంగల్ రేవంత్‌రెడ్డి పేర్లను ఖారారు చేశారు. అయితే నారాయణపేట, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాల అభ్యర్థులను సైతం రేపోమాపో విడుదల చేయనున్నారు. అయితే కొల్లాపూర్ స్థానాన్ని తెలంగాణ జనసమితి అడుగుతున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట శివకుమార్‌రెడ్డి, దేవరకద్ర పవన్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతుండడంతో ఆలస్యం అయింది. కొల్లాపూర్ స్థానంపై కూడా తర్జనభర్జనలు కొనసాగుతున్నప్పటికీ నామినేషన్ల పర్వం ప్రారంభమై రెండు రోజులు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా మహబూబ్‌నగర్ స్థానాన్ని తెలంగాణ జనసమితి మొదటి నుండి కోరగా చివరకు తెలుగుదేశం పార్టీకి దక్కింది. దాంతో తెలంగాణ జనసమితి నేతలు నిరాశకు గురయ్యారు. అందరు ఊహించిన్నట్లుగానే తెలుగదేశం పార్టీకి రెండు స్థానాలు వస్తాయని భావించారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి తేదేపా రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

ఆంధ్ర పార్టీలను అడ్రస్ లేకుండా తరిమికొడదాం
* సంక్షేమాన్ని కాపాడుకుందాం * మంత్రి జూపల్లి
పెద్దకొత్తపల్లి, నవంబర్ 13: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర పార్టీలను అడ్రస్ లేకుండా తరిమికొట్టి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకొని సంక్షేమాన్ని కాపాడుకుందామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధిలోని తిరుమలపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఏం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఆంధ్ర పార్టీలన్నీ జట్టు కట్టి సంక్షేమాన్ని చీకట్లో నెట్టేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. ఆంధ్ర పాలకుల పాలనలో సాగునీరులేక పంటలు పండక రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రం వచ్చాక దేశంలోనే సంక్షేమ పథకాలను అమలుచేయడంలో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. సాగునీరు రావడంతో రైతులు పొలాలలో వేసుకున్న పంటలు పచ్చదనంతో ఉంటున్నాయంటే కేసీఆర్ ఘనతేనని అన్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ములేకనే అన్నీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఏకమై రాష్ట్ర సంక్షేమాన్ని చీకటిమయం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నాయన్నారు. ఆంధ్ర పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు అమరవాతిలో తాకట్టు పెట్టారని, సంక్షేమాన్ని అడ్డుకోవడం ఖాయమన్నారు. అటువంటి పార్టీలను బొందపెట్టి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టాలని కోరారు.
టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
మాచారం గ్రామ పరిధిలో టీఆర్‌ఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జూపల్లి అరుణ్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు గెలుపుకోసం కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ విష్ణు, ఎంపీపీ వేంకటేశ్వరరావు, జడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు శ్రీకృష్ణ, దశరథం, వెంకటస్వామిగౌడ్, తాలయ్య తదితరులు పాల్గొన్నారు.