మహబూబ్‌నగర్

ప్రభుత్వ అసుపత్రుల్లో అన్ని సేవలు ప్రజలకు అందేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసాపేట, నవంబర్ 15: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగు పర్చిందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ యోగితరాణి సూచించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి ఆసుపత్రిలో వివిధ బాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరోగ్యశ్రీ మిత్ర సిబ్బంది అంజనేయులును రికార్డులు ఎక్కడ ఉన్నాయని అరా తీశారు. రోజూ ఐదుగురి కంటే ఎక్కవ రావడం లేదని అందుకే రికార్డులో ఎక్కించలేదని సమాధానం చెప్పడంతో రోగులు తక్కువగా ఉంటే ఇక్కడ నువ్వెందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అప్పుడే అక్కడికి వచ్చిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి కమిషనర్ యోగితరాణి వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రిలో ఉన్న వివిధ భాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్‌ను పరిశీలించారు. రోజుకు ఎంతమంది రోగులకు పరీక్షలు చేస్తున్నారని వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. గత మూడు నెలల నుండి 15మంది రాలేదని సమాధానం చెప్పారు. దీంతో డిఎంహెచ్‌ఓ రజినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసుపత్రిలో ఉన్న రికార్డులు తెప్పించుకోని తనిఖీ చేయగా ఆ రికార్డులలో ఎలాంటి అభ్యున్నతి లేకపోగా ఇలా ఉంటే జాతీయ రహదారికి అనుకోని ఉన్న ఈ ఆసుపత్రికి రోగులు ఎలా వస్తారని అన్నారు. మీకు జీతాలు ఎలా ఇవ్వాలని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు.

గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయం
* పేట టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి
ధన్వాడ, నవంబర్ 15: గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయమని నారాయణపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మరికల్ మండల పరిధిలోని రాకోండ గ్రామంలో మరికల్ మండల పార్టీ అధ్యక్షులు వై.వెంకట్రామిరెడ్డి సమక్షంలో రాకోండకి చెందిన బీజేపీ పార్టీ నాయకుడు మొగులయ్య మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా రాకోండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, లక్ష్మయ్య, సంజీవ్, వెంకటేష్‌తోపాటు మరో 30మందిపైగా టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పేట మాజి ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్టమ్రుఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో చేసిన పలు అభివృద్ది పనులకు అకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే వెంట మరికల్ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వై.వెంకట్రామిరెడ్డి,మరికల్ మండల రైతుసమన్వయ కమిటి చైర్మన్ సంపత్‌కుమార్,టీఆర్‌ఎస్ పార్టీ రాకోండ యూత్ నాయకుడు గదం మల్లేష్,నాయకులు జగదీశ్వర్,జి,రాములు,సురేష్,రవికూర్,కుర్మయ్య,తదితరులు పాల్గొన్నారు.