మహబూబ్‌నగర్

పోటాపోటీగా ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, నవంబర్ 15: జడ్చర్లలో టిఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థులైన లక్ష్మారెడ్డి, మల్లురవి గురువారం జడ్చర్ల పట్టణంతో పాటు మారుమూల గ్రామాలల్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వారు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మంత్రి లక్ష్మారెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో మార్నింగ్‌వాక్ చేస్తూ వాకర్స్‌తో మాట కలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారం చేట్టిన వెంటనే ఉద్యోగార్థుల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన సిగ్నల్‌గడ్డ, నిమ్మబావి గడ్డ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల పరిధిలోని పొలేపల్లి,కిష్టారం,అంబాటాపూర్ తదితర గ్రామాలల్లో కూడా మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు మద్దతుగా ఆయన సతీమణి శే్వతా లక్ష్మారెడ్డి గ్రామాలల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మహాకూటమి అభ్యర్థి డాక్టర్ మల్లురవి పట్టణంలోని బాబిస్ట్రీట్, మార్కెట్ యార్డ్ తదితర ప్రాంతాలల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కూడా ఎన్నికల ప్రచారం చేశారు.తెలంగాణ సెంటిమెంట్‌తో 2014 ఎన్నికల్లో గెలుపొందిన ప్రస్తుత టీఆర్‌ఎస్ అభ్యర్థి అధికార దుర్వినియోగానికి పాల్పడి దౌర్జన్యంగా అక్రమ ఆస్తులు ఆర్జించారని వారు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమాలల్లో ఆయా పార్టీల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
చంద్రబాబు గుప్పిట్లో కాంగ్రెస్
* మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 15: వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లిందని మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఎద్దెవా చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ మండలంలోని పత్తెపూర్, జైనలిపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రామాలను పూర్తిగా విస్మరించడంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలను బాగుచేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీ ఆర్ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని అందులో భాగంగా సిసిరోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు తదితర వాటికి నిధులను మంజూరు చేసి గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. నాలుగున్న ఏళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సుమారు రూ.4వేలకోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో ఐటీ టవర్ రానున్నడంతో ఇక్కడి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లబిస్తాయన్నారు. రైతులకు రైతుబాందవుడిగా ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిలిచారని ప్రతి రైతుకు రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేలు చోప్పున రెండు పంటలకు రూ.8వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కే దక్కిందన్నారు. ప్రజలంతా టీ ఆర్ ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని వచ్చే ఎన్నికల్లో మహకూటమికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ శ్రీదేవి, జైనలిపూర్ మాజీ సర్పంచ్ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.