మహబూబ్‌నగర్

లక్ష్మారెడ్డికి ఇవే చివరి ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, నవంబర్ 15: జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి లక్ష్మారెడ్డికి ఇవే చివరి ఎన్నికలని మహాకూటమి అభ్యర్థి మల్లురవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌లు అన్నారు. గురువారం మల్లురవి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ సెంటిమెంట్‌తో గత ఎన్నికల్లో గెలుపొందిన లక్ష్మారెడ్డి ప్రజాసేవ చేయడాన్ని విస్మరించి అక్రమార్జనకు పెద్దపీట వేశారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమ దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యేగా గెలుపొంది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని మల్లురవి విమర్శించారు. తాను విసేరిసిన పదవిని మల్లు రవి పొందారని మంత్రి మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. తాను 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన మిత్రుడైన ఎర్రశేఖర్ స్వల్ప ఓట్లతో ఓడిపోగా లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితమైన విషయం మరిచిపోవద్దని హితవుపలికారు. వ్యక్తిగతంగా ఎర్ర శేఖర్, తాను మంచి మిత్రులమని, ఈ ఎన్నికల్లో మహాబూబ్‌నగర్ ఎర్రశేఖర్, జడ్చర్లలో తాను గెలుపొందడం ఖాయమని మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరంకుశ, రాక్షస పాలన కొనసాగుతుందని, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి, మహాబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లాంటి అనేక మంది అభ్యర్థులు ఓటమిపాలవుతారని మల్లురవి, ఎర్రశేఖర్‌లు జోస్యం చెప్పారు. ప్రస్తుతం మహాకూటమి ప్రభంజనం కొనసాగుతుందని, రాష్ట్రంలో నిన్నటి వరకు నిస్తేజంగా కనిపించిన మహాకూటమిలో నామినేషన్ల దాఖలు అనంతరం ఉత్సాహం ఉప్పొంగుతోందని అన్నారు. ప్రజలు రాజకీయ పునరేకీకరణను కోరుకుంటున్నారని, అందువల్లనే ఈ ఎన్నికల్లో మహాకూటమి రాష్ట్ర వ్యాప్తంగా 85 నుండి 90స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్,టిడిపి నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈరాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు సంచుల మూటలను ఎరగా వేస్తున్నారని వారు ఆరోపించారు. ఓటర్లను సంతలో పశువులు కొన్నట్లు గా కొనుగోలు చేసేందుకు మొదటి విడతగా ఒక్కో అభ్యర్థికి రూ.పది కోట్ల చొప్పున, రెండో విడతగా నామినేషన్ల దాఖలు సమయంలో మరో పది కోట్ల చొప్పున, చివరగా మరో పది కోట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తున్నారని వారు ఆరోపించారు.