మహబూబ్‌నగర్

ప్రజా విశ్వాసం లేని మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, నవంబర్ 15: ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీలు అన్నీ మహాకూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించడానికి మాయ కూటమిగా ఏర్పాడ్డయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని బహుదూర్‌గూడెం, బండపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహకూటమిగా అవతరించిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నీళ్ళు, నిధుల, నియామకాలు , ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీ ఆర్ ఎస్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీ ఆర్ ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నర ఏళ్లలోనే కేసీ ఆర్ చేసి చూపించారని అన్నారు. ప్రజారైతు సంక్షేమమే ద్యేయంగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించిందని, గ్రామాలాభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో టీ ఆర్ ఎస్ కి మరే పార్టీ సాటిరాదన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు , మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కళ్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్, రైతుబందు, రైతుబీమా, షాదిముబారక్, ఆసరాఫించన్లు తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కొల్లాపూర్ అభివృద్ది కోసం ఆహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. మహకూటమి నేతల మాటలను నమ్మవద్దని , అభివృద్ది, సంక్షేమం కోసం టీ ఆర్ ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తాండలోధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తాండకు చెందిన కృష్ణ, గౌతమిలతో పాటు పలవురు టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్‌నాయుడు, జడ్పిటిసి రవి, విండో వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బాలరాజుయాదవ్, టీ ఆర్ ఎస్ నాయకులు గోవర్దన్‌సాగర్, తిరుపతయ్యసాగర్, యువజన విభాగం నాయకులు కరాటే గోపాల్,సూర్యవంశం రాము, దర్గయ్య, వెంకటపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో కలకలం...

*అధిష్ఠానం నిర్ణయంపై రగడ

మహబూబ్‌నగర్, నవంబర్ 15: మహాకూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో కాంగ్రెస్, తెలంగాణ జనసమితి నాయకులు అలకబూనారు. అందులో భాగంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పటికిని మరికొంతమంది నాయుకులు మాత్రం ససేమిరా అంటూ తాము మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తాము పోటీలో ఉంటేనే టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమి చెందుతారని భావిస్తున్నారు. అందులో భాగంగా గురువారం టీపీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లోని భగీరథకాలనీలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీ నుండి మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి టికెట్‌ను ఆశించానని కానీ ఇక్కడి స్థానాన్ని మహాకూటమి నుండి టీడీపీకి కేటాయించడం సరైన నిర్ణయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ, బాధతో ఉన్నారని అన్నారు. తాను పోటీ చేస్తున్నానని ఎన్సీపీ నుండి ఈ నెల 17వ తేదీన నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడారికే ఈ నిర్ణయం తీసుకున్నానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచి తీరుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొంత సైద్దాంతిక భావ స్వారూప్యత కలిగిన ఎన్సీపీ నుండి తాను బరిలో దిగుతున్నానని తెలిపారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని వారి అరాచాకాలను ఎన్నికల ప్రచారంలో వివరించాల్సిన అవసర ఉందని అన్నారు. కాగా టీపీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి అనుచరులు సైతం పోటీలో ఉండాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దాంతో ఆయన ఎన్సీపీ అభ్యర్థిగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. సురేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా మహాకూటమిలో కలకలం రేగింది. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం సురేందర్‌రెడ్డి తొందరపడొద్దంటూ సలహా ఇస్తున్నారు. కానీ ఆయన మాత్రం తాను పోటీలో ఉండటం ఖాయమని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహబూబ్‌నగర్ నియోజకర్గంలో చెల్లా చెదురు అయ్యే ప్రమాదం ఉందని తాను తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. కాగా మహబూబ్‌నగర్ నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ 1994 నుండి ఆ పార్టీ ఆభ్యర్థులు గెలవలేదు. ఈ ధపానైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. సురేందర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. ముఖ్యంగా మహాకూటమిలో సీటు దక్కించుకుని నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలోకి అడుగుపెట్టిన ఎర్రశేఖర్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి ఎంత మద్దతు లభిస్తుందనే ప్రచారం సైతం అప్పుడే ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల్లో దాదాపు రెండు మూడు గ్రూపులు ఉండడంతో ఓ గ్రూపు సురేందర్‌రెడ్డి వెంట వెళ్లిపోయినా మిగతా గ్రూపు మాత్రం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండే అవకాశం కనపడుతోంది. ఏదిఏమైనప్పటికీ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ సురేందర్‌రెడ్డి తాను ఎన్పీపీ నుండి పోటీ చేయడం ఖాయమంటూ ప్రకటించారు.