మహబూబ్‌నగర్

కేసీఆర్.. ధైర్యముంటే ఉస్మానియాలో సభ పెట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 17: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలకు వ్యతిరేకంగా దొరలపాలన సాగిస్తున్న కేసీఆర్..నీకు ధైర్యముంటే ఉస్మానియా యూనివర్శిటీలో సభ పెట్టాలని గద్వాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సవాల్ విసిరారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీకే సత్యారెడ్డి బంగ్లాలో వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి పదవీ కోసమే కేసీఆర్ ఉద్యమాలు చేశారని, తెలంగాణ ప్రజలను ఉద్యమం పేరిట వంచించి..1400 మంది అమరులకు కారణమయ్యారని వాపోయారు. విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలతో ఉద్యమాన్ని రగల్చి, ఉద్యమకారుల ఆకాంక్షలను పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆనందంగా పదవులు అనుభవించారని చెప్పారు. ఉద్యమం చేసిన అందరినీ పక్కన పెట్టి ఉద్యమద్రోహులను చంకన పెట్టుకొని బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని వాపోయారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలురైతులకు న్యాయం చేస్తామని, ఏకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్నలకు రూ.2 వేల మద్దతుధర, పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేలు, పంటబీమా ప్రీమియం చెల్లింపు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి వంటి ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 15వ వార్డులోని, జమ్మిచేడు, చింతలకుంట, గుడ్డందొడ్డి, ద్యాగదొడ్డి, చింతరేవుల గ్రామాలకు చెందిన 2000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, నందినె్న ప్రకాష్‌రావు, రామాంజనేయులు, ఎల్లప్ప, డీటీడీసీ నర్సింహులు, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

మహబూబ్‌నగర్, నవంబర్ 17: జిల్లాలో ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగా నామినేషన్ల ఘట్టం ఆరవ రోజు శనివారం ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవార్గల్లో దాదాపు 35 నామినేషన్లకు పైగా దాఖలు అయ్యాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుండి నామినేషన్‌ను దాఖలు చేశారు. మరో ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా తల్లోజి ఆచారి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఆచారి తన నామినేషన్ దాఖలు సందర్భంగా వేలాది మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా బాలస్వామిగౌడ్ తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మరో నాలుగురు సైతం వివిధ పార్టీల నుండి పలువురు నాయకులు నామినేషన్లను దాఖలు చేశారు. దేవరకద్ర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి సైతం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే మహాకూటమిలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇంకా ఆ పార్టీలో సస్పెన్షన్ కొనసాగుతుంది. అయినప్పటికిని పవన్‌కుమార్‌రెడ్డి మాత్రం నామినేషన్ వేశారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎన్సీపీ నుండి అనుగోతి రాజు, స్వతంత్ర అభ్యర్థిగా సంపత్‌కుమార్ నామినేషన్‌ను వేశారు. అచ్చంపేట నియోజకవర్గం నుండి బీఎస్పీ నుండి కోయల శ్రీనివాస్, తెరాస నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, బీజేపీ నుండి మల్లేశ్వర్, స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్‌లను తమ నామినేషన్లను దాఖలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఎల్‌ఎఫ్ నుండి ఇద్దరు అభ్యర్థులు వెర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరు వేణుగోపాల్ కాగా మరోకరు బ్రహ్మయ్యచారి, బీఎస్పీ నుండి సంజీవులు, స్వసంత్ర అభ్యర్థిగా శ్రీనివాసులు, సమాజ్‌వాదీ పార్టీ నుండి బరిగెలా స్వరూపారాణి తమ నామినేషన్ దాఖలు చేశారు. అలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. గద్వాలలో హన్మంతు అనే వ్యక్తి స్వసంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మక్తల్‌లో సైతం ఒకరు స్వసంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.