మహబూబ్‌నగర్

కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, నవంబర్ 17: కేసీ ఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని శాగాపుర్ తాండ, దావుత్‌ఖాన్‌పల్లి, మాదరావుపల్లి, కొత్తపేట గ్రామాలలో ధూంధాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అభివృద్దిని , సంక్షేమాన్ని అడ్డుకోవడానికే కాంగ్రెస్, టీడీపీ, సీపీ ఐ, టీజే ఏస్ పార్టీలు మాహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్దిని నాల్గున్నర ఏళ్లలో కే సీ ఆర్ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా టీ ఆర్ ఎస్ పార్టీ మెనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. ప్రజా రైతు సంక్షేమమే ద్యేయంగా ప్రతి ఏకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి నళ్ళా నీళ్లు, రైతుబందు, రైతు బీమా, కళ్యాణిలక్ష్మి, ఆసరా పించన్లు తదితర వాటిని కేసీ ఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికలల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నేరవేర్చిన ఘనతటీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం 20 ఏళ్లుగా ఆవిశ్రాంతంగా శ్రమిస్తున్నానని మరోసారి ఓట్లు వేసి గెలిపిస్తే మరింత అభివృద్దికి దోహదపడాలని ఆయన కోరారు. అధికారం కోసం పరితాపించే నాయకులను నమ్మవద్దని ఆయన సూచించారు. టీ ఆర్ ఎస్ పార్టీని ఆశ్వీరదించి బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. టీ ఆర్ ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి లబ్దిచేకూర్చాయన్నారు. అలాగే టి ఆర్ ఎస్ యూత్ వింగ్ అద్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహంచారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్, విండో చైర్మన్ బాల్‌రెడ్డి,వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు తిరుపతయ్యసాగర్, గోవర్దన్, జయరాములుసాగర్, డైరెక్టర్‌లు రాజేష్ రెడ్డి, తిరుమల్ యాదవ్, ఎంపీటీసీలు రాంచందర్ యాదవ్,వెంకటమ్మ, నాయకులు బలరాం,బొట్టు బాలరాజు, సహదేవ్ నాయక్,యూత్ వింగ్ నాయకులు కరాటి గోపాల్, సుర్యవంశం రాము,దర్గయ్య, ప్రేమ్ నాయక్, బాలరాజు తదితరులు పాల్గోన్నారు.