మహబూబ్‌నగర్

సమాన విద్య కోసం వంద రోజుల విద్యా పోరాటయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 21: సమ సమాజం కోసమే సమాన విద్య అని, సమాన విద్య కోసం వందరోజుల పోరాట యాత్రను చేపట్టినట్లు విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి అన్నారు. వంద రోజుల విద్యా పోరాట యాత్రలో భాగంగా చేపట్టిన యాత్ర బుధవారం మండలంలోని శ్రీపురం, బొందలపల్లి, తూడుకుర్తి, బిజినేపల్లి మండలంలోని సల్కర్‌పేట, అల్లీపూర్, నంది వడ్డెమాన్, బిజినేపల్లి తదితర గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో రామస్వామి మాట్లాడుతూ లేనివాడికైనా, ఉన్నవాడికైనా ఒకే బడి, ఒకేరకమైన విద్య అందించాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని విద్య రంగంలోకి 15శాతం నిధులు కేటాయించాలన్నారు. డీటీఎఫ్ జిల్లా అభ్యక్షులు బి. గోవర్ధన్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద వారికి విద్యను దూరం చేయడమేనని అన్నారు. విద్య అంగడి సరుకు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
మానవపాడు, నవంబర్ 21: శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను బుధవారం హిమత్ అభిలాష్ ఐపీఎస్ ఎలక్షన్ అబ్జర్వర్ ఆలయాలను సందర్శించారు. ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురాతన ఆలయాలను పరిశీలించారు. ఆలయాల ప్రాముఖ్యతను అర్చకులు ఆయనకు వివరించారు.
అమ్మవారి ఆలయంలో చీరల వేలం
జోగుళాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం చీరల వేలం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన 182 చీరలను వేలం నిర్వహించగా 39,800 ఆధాయం వచ్చినట్లు ఈవో గురురాజ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బీజేపీకి వర్కటం జగన్నాత్‌రెడ్డి రాంరాం
* 24న హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక
మక్తల్, నవంబర్ 21: బీజేపీలో కొత్తతరం వారికి ఎలాంటి అవకాశం, గుర్తింపు లేనికారణంగానే తాను బీజేపీని వీడనున్నట్లు తెలంగాణ ఐటి కో-కన్వీనర్ వర్కటం జగన్నాత్‌రెడ్డి తెలిపారు. బుధవారం మక్తల్‌లోని తన నివాసంలో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. బీజేపీలో చేరినప్పటి నుండి తను సమాజ సేవలో భాగస్వామినై పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఎంతో సేవ చేశానని వర్కటం తెలిపారు. తను పార్టీలోకి కొత్తగా వచ్చినప్పటికి గతంలోని వారు ప్రజలకు ఎలాంటి సేవలు చేశారో తనకు తెలియదు కానీ తనవంతు కర్తవ్యంగా ప్రజాసేవలో తను భాగస్వామినెనని వర్కటం తెలిపారు. ప్రధాని నరేంద్రమోది పాలన బేష్‌గా ఉందని, మళ్లీ ఆయనే ప్రధానమంత్రి కావాలన్నదే తను కోరుకుంటున్నానని అన్నారు. మక్తల్ టికెట్‌ను మంచి వ్యక్తులకు ఇవ్వాలన్నదే తను కోరానని, మక్తల్ టికెట్‌ను ప్రస్తుతం కొండయ్యకు ఇవ్వడం జరిగిందని అయినా బండారు దత్తాత్రేయను మక్తల్‌లో బీజేపీని గెలిపించి సత్తా చూపమని చెప్పండని అన్నారు. కాంగ్రెస్‌లో యువ నాయకులు రావడంతో ఆపార్టీ ప్రధానమైన స్థానాల్లో గెలువబోతోందని, బీజేపీలో మాత్రం యువతకు ప్రాధాన్యం లేకే వెనుకబాటు తనాన్ని చవిచూస్తుందని అన్నారు. ఈనెల 24న తాను దాదాపు 3వేల మంది సహచరులతో హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు వర్కటం జగన్నాత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనపురం వెంకటప్ప, సురేందర్‌రెడ్డి, మహబూబ్‌పాష, లక్ష్మణ్, యూసూఫ్, మహబూబ్‌అలీ, జనార్ధన్‌రెడ్డి, నెట్టంపాడు రాంరెడ్డి, దేవ, గంప యల్లప్ప, రాఘవేంద్ర, చిన్న బాల్‌రాజ్ సైతం బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.