మహబూబ్‌నగర్

ఘనంగా మిలాద్ ఉన్ నబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 21: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, దేవరకద్ర తదితర పట్టణాల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో మదినామజీద్ నుండి షాసాబ్‌గుట్ట దర్గా వరకు వేలాది మంది ముస్లీం యువకులు భారీ వాహనర్యాలీ నిర్వహించారు. ముస్లీం మతపెద్దలు ముందుగా మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ మజీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిలాదున్ -నబిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా జడ్చర్లలో జరిగిన తెరాస ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని ముస్లీంలకు మిలాదున్- నబి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లీంలు జాగరణ చేశారు. తమ పెద్దలను స్మరించుకుంటూ ఈద్గాల దగ్గర ప్రార్థనలు చేశారు.

నారాయణపేట డివిజన్‌లో..
నారాయణపేటటౌన్: నారాయణపేట డివిజన్‌లోని గ్రామాల్లో ముస్లిం లు మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ప్రార్థనా మందిరాల్లో జాగరణ నిర్వహించి మహ్మద్ ప్రవక్త బోధనలను మననం చేసుకున్నారు. అనంతరం బుధవారం ఉదయం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. నారాయణపేటలో ఉదయం పది గంటలకు స్థానిక లాల్‌మజీద్ నుండి ముస్లింలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తఖీబాబా సజ్జాద్ ఏ నషీన్ సయ్యద్ ఘయాసుద్దీన్ ఖాద్రి ప్రారంభించారు. అనంతరం లాల్‌మసీదు వద్ద పెద్దఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు హరినారాయణ్‌భట్టడ్, గందె చంద్రకాంత్, కనె్న జగదీశ్, కోట్ల రాజవర్దన్‌రెడ్డి, విజయ్‌సాగర్, అమీరోద్దీన్, జహీరోద్దీన్ తదితరులు ర్యాలీలో ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేయగా, వీరసావర్కర్ చౌరస్తా సమీపంలో బీజేపీ ఏర్పాటు చేసిన వేదిక వద్ద బీజేపీ అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి, నాయకులు జ్యోతిర్నాథ్, బాలింగం, ప్రభాకర్‌వర్దన్, బోయ లక్ష్మణ్, సిద్ది వెంకట్రాములు, గోపాల్‌యాదవ్, తాజుద్దీన్, కోడిగుడ్ల సాదిక్, మహబూబ్ అలీ తదితరులు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. చౌక్‌బజార్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన వేదిక వద్ద కాంగ్రెస్ అభ్యర్థి వి.కృష్ణ, నాయకులు వి.శివకుమార్, రాజు, కార్తీక్, కొనంగేరి హన్మంతు, వెంకటపతి, బోయ రాములు, కెంచె నారాయణ, కుంటిమారి అశోక్ తదితరులు ర్యాలీలో పాల్గొన్న వారికి ఫ్రూట్ సలాడ్‌ను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేయగా, బిఎల్‌ఎఫ్ వేదిక వద్ద బిఎల్‌ఎఫ్ నాయకుడు శివకుమార్‌రెడ్డి, ఆయన మేనల్లుడు చిట్టెం సాయి అభిజయ్‌రెడ్డి, బీఎల్‌ఎఫ్ నాయకులు జి.సుధాకర్, డాక్టర్ వై.మల్లికార్జున్, మునీర్ అహ్మద్ ఫారుఖీ, అబ్దుస్ సలీం, జలీల్‌బేగ్, జొన్నల సుభాష్, సత్యరఘుపాల్‌రెడ్డి, సత్తిరెడ్డి తదితరులు ఫ్రూట్ జ్యూస్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి, బిఎల్‌ఎఫ్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొనగా వారికి ముస్లిం మతపెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ర్యాలీకి కొత్త ఉత్తేజాన్ని నింపారు. మిలాదున్నబీ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా డిఎస్పీ శ్రీ్ధర్ నేతృత్వంలో సిఐ సంపత్, ఎస్సై శ్రీనివాస్‌లు ప్రత్యేక పోలీసులతో కలసి బందోబస్తు చేపట్టారు.

దేవరకద్రలో ఎన్నికల కంట్రోల్‌రూమ్
* ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతకుమారి
దేవరకద్ర, నవంబర్ 21: అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకే నియోజవర్గకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు నలుగురు అధికారులతో 24గంటలు అందుబాటులో ఉంచామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతకుమారి తెలిపారు. బుధవారం తహశీల్దార్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అమె మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఖర్చులు చూపెట్టాలని అంతకు మించి ఖర్చులకు పాల్పడి నట్టయతే మాదృష్టికి గాని, కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అమె అన్నారు. కంట్రోల్‌రూమ్ నెంబర్స్ 8328127067, 9951229144, కు సమాచారం అందించాలని లేదా సీఇఓ డాట్ తెలంగాణ యాప్ ద్వారా సమాచరం అందించాలని అమె సూచించారు. విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నిఘ అదికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరుగుతుందని అమె తెలిపారు. నిబంధనలు అతిక్రమించి వ్యవరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.

మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి
పాన్‌గల్,నవంబర్ 21: కొల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి రెండు పర్యాయాలు పోటిచేసిన పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో మంత్రి కేటి ఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటి ఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2014 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డి తెరాస గుటికి చెరారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా , 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసి ఓటమి పాలయ్యారు. 2014లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన టిక్కెటు లభించకపోవడంతో తటస్తంగా ఉన్నారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సీఎం సభా స్థలిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అల
దేవరకద్ర, నవంబర్ 21: ఈనెల 25న అదివారం ముఖ్యమంత్రి కేసీఅర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్రకు రానున్నడంతో మాజీ ఎమ్మెల్యే అలవెంకటేశ్వర్‌రెడ్డి, పోలీస్ డీఎస్పీ భాస్కర్ జిల్లా అదికారులు భూత్‌పూర్ సీఐ పాండురంగయ్య, దేవరకద్ర ఎస్సై వెంకటేశ్వర్లు మండల టీఅర్‌ఎస్ నాయకులు దేవరకద్ర బాలుర ఉన్నత పాఠశాల అవరణలోని సభాస్థలం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.