మహబూబ్‌నగర్

టీఆర్ ఎస్‌ను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, నవంబర్ 21: టీ ఆర్ ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని జమ్మాపూర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధూంధాంలో పాల్గొని మాట్లాడారు. ప్రజారైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగించారని, కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ , టీజేఎస్ పార్టీలు మాయకూటమిగా మారి అధికారం కోసం పరితపిస్తున్నారని తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే టీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను , కాల్వల తవ్వకాలను చేపట్టనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. ధూందాంలో కళాకారుల ఆట పాటలు గ్రామస్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేస్‌నాయుడు, జడ్పిటిసి రవి, విండో వైస్‌చైర్మన్ భాస్కర్‌యాదవ్, టీ ఆర్ ఎస్ నాయకులు గోవర్దన్‌సాగర్, తిరుపతయ్య, జయరాములుసాగర్, నాగేంద్రం, సురేష్‌శెట్టి, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల బహిరంగ సభ సక్సెస్
* సుమారు 50వేల మంది హాజరు
* టీఆర్‌ఎస్ శిబిరంలో ఉరకలెత్తిన ఉత్సాహం
జడ్చర్ల రూరల్, నవంబర్ 21: జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభ విజయవంతం అయింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభకు టీఆర్‌ఎస్ సెక్రటరి జనరల్ కె.కెశవరావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌తో పాటు అనేక మంది టీఆర్‌ఎస్ పార్టీజిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్న ఈ సభకు సుమారు 50వేల మంది జనం హాజరయ్యారు. సభ ప్రాంగణం మొత్తం నిండుకోవడంతో పాటు ప్రాంగణం చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభలో పాల్గొనేందుకు ప్రయత్నించడంతో వారిని నివారిండం పోలీసులకు కష్టతరంగా మారింది. ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం అయ్యింది. అంతవరకు ప్రముఖ కళాకారుడు
సాయిచంద్ బృందం తమ ఆటపాటలతో సభికులను ఉర్రూతలుగించారు. ఈసందర్బంగా ఎంపి జితేందర్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. టీఆర్‌ఎస్ ని మళ్లీ అధికారంలోకి తేవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారం చేపట్టాలని ఆయన ప్రజలను కోరారు. సభకు హాజరైన ప్రజలు లక్ష్మారెడ్డి సతీమణి శే్వతాలక్ష్మారెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. సభ సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సభ 3గంటలు ఆలస్యంగా ప్రారంభం అయినా ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు నొచ్చుకోకుండా ప్రాంగణంలోనే ఉత్సాహంగా గడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే సమయంలో పాల్గొన్న ప్రజలందరూ లేచి నిల్చొని ప్రసంగం ఒపికగా విన్నారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.