మహబూబ్‌నగర్

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి.. మా ఘనతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మరోసారి ఆశీర్వదించండి.. జడ్చర్లలో గులాబీ గుభాళించాలి * బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
జడ్చర్ల, నవంబర్ 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టిన వెంటనే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. బుధవారం జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలోని నవాబుపేట, నారయణపేట, మక్తల్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు జిల్లా పరిస్థితులు తనను కంటితడి పెట్టించాయని అన్నారు. అనేక ప్రతికూలతల మధ్య తాను 14 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే 43 వేల కోట్లతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశానని అన్నారు. అందులో భాగంగానే కంటివెలుగు, కేసీఆర్ కిట్ లాంటి వినూత్న పథకాలను వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి సారధ్యంలో విజయవంతంగా అమలు పరిచామని అన్నారు. ఈ పథకాలు ఇప్పటితో ఆగిపోవని మున్ముందు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇఎన్‌టి పరీక్షలు కూడా నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరి బ్లడ్‌గ్రూప్ వివరాలను సేకరించి కంప్యూటర్‌లో నిక్ష్పిప్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తామని వివరించారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలను విభజించడం జరిగిందని, ప్రస్తుతం పాలమూరు జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలవల్ల వలసలు పూర్తిగా నివారించబడుతున్నాయని, జీవనోపాధి కోసం గతంలో వలసలు వెళ్లిన వారంతా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకొని ఇక్కడే వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులుగా ముద్ర పడిన ప్రాజెక్టులను 90శాతం పూర్తి చేసి జిల్లాలోని 8.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొని జిల్లాలో ఎలాంటి అభివృద్ధిపనులు చేయకుండా జిల్లా ప్రజలను దగా చేశారని ఆయన ఆరోపించారు. అలాంటివ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమి పేరుతో కాంగ్రెస్,టిడిపిల నాయకులు ఎ మోహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశ్యంతో తాను తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ప్రస్తుతం కొల్లాపూర్,నాగర్‌కర్నూల్, దేవరకద్ర నియోజకవర్గాల నుండి మహాకూటమి తరపున పోటిలో నిలిచిన హర్షవర్థన్‌రెడ్డి, నాగంజనార్థన్‌రెడ్డి,పవన్‌కుమార్ రెడ్డిలు 35కేసులు వేశారని, అంతేకాక రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూములను ఇవ్వడానికి సిద్దంగా ఉన్న రైతుల వద్దకు వెళ్లి వారి భూములను అప్పగించొద్దని ఒక్కో ఎకరా రూ.50లక్షలు ఉంటుందని వారిని గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మక్తల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దయాకర్ రెడ్డి మన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబు సారధ్యంలో పని చేస్తున్నారని ఆయనను గెలిపించి మన ప్రాజెక్టులను మనమే అడ్డుకుందామా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని, అర్థం అయినా, అర్థం కానట్లు వ్యవహరిస్తే మన జీవితాలే నాశనం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పనికిమాలిన పార్టీలకు ఓట్లు వేస్తే వ్యర్థమవుతాయని ఆయన అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లక్ష్మారెడ్డి బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, ఆయన గెలుపు ఖాయమని 76శాతం ఓటర్లు ఆయన వైపే ఉన్నారని సర్వే నివేదికలు తెలుపుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభ ఉమ్మడి జిల్లా బహిరంగ సభను తలపిస్తుందని, సుమారు 60వేల మంది రావడం చూస్తుంటే ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని లక్ష ఓట్ల మేజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా జిల్లాలోని 14స్థానాలల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు.