మహబూబ్‌నగర్

అంబులెన్సులో వచ్చి ఓటును వేసిన వంశీచంద్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, డిసెంబర్ 7: బీజేపీ కార్యకర్తల చేతిలో త్రీవంగా గాయపడిన తాజా మాజీ ఎమ్మెల్యే , కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అంబులెన్సులో వచ్చి స్వంత గ్రామం వెల్దండ పూర్వపు మండలం శేరిఅప్పరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియెగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లిలో బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో త్రీవంగా గాయపడి స్పహకోల్పోయిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని నిమ్స్ అసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న వంశీచంద్‌రెడ్డి అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వయ్, పోలీస్ భద్రత మధ్య అంబులెన్సులో భార్య అశ్లీషారెడ్డితో కలసి వచ్చి సాయంత్రం నాలుగున్నర గంటలకు శేరిఅప్పరెడ్డిపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వంశీచంద్‌రెడ్డి ఓటు హక్కును వినియెగించుకునేందుకు అంబులెన్సులో వస్తుండన్నా సమాచారం అందుకున్న వెల్దండ, గుండాల, చెదురుపల్లి, భైరాపూర్, గిరిజన తాండలతో పాటు స్వంత గ్రామం శేరిఅప్పరెడ్డిపల్లిలో ఆపార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు బీజేపీకి వ్యతిరేకంగా వంశీచంద్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తు రోడ్డుకు ఇరువైపుల చూసేందుకు ఎగబడ్డారు. చిరిగిన చొక్క, చేతికి పట్టితో వంశీచంద్‌రెడ్డి రావడంతో ఎంతపపైందంటూ తోడుగ గ్రామస్థులు వెంట వచ్చి ఓటు వేయించారు. గ్రామస్థుల అప్యాయతను చూసి వంశీచంద్‌రెడ్డితో పాటు భార్య అశ్లీషారెడ్డి ఒకింత ఉద్వేగానికి లోనుకావండంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఈసందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సైలు వీరబాబు, బాలకృష్ణ గట్టి పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాజాపూర్‌లో మంత్రి జూపల్లిపై
ప్రత్యర్థుల తిరుగుబాటు
కోడేరు, డిసెంబర్ 7: మండల పరిధిలోని రాజాపూర్‌లో పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రచారం చేస్తున్నాడనే నెపంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యర్థివర్గం గోబ్యాక్, డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో మంత్రి జూపల్లిపై తిరగబడేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన భద్రతా సిబ్బంది గట్టి భద్రత మధ్య పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి వాహనం ఎక్కేవరకు సురక్షితంగా పంపించారు. ఈ ఘటనతో పోలింగ్ కొద్దిసేపు ఆగిపోయింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఎక్కడివారిని అక్కడ అదుపుచేసి మళ్లీ పోలింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం ఐదుగంటలు దాటిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి నిల్చున్నారు. మొత్తంమీద ఈ ఘటన మండలంలో కలకలంలేపింది.