మహబూబ్‌నగర్

కూటమే కొంప ముంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, డిసెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశాభివృద్ధి చెందిందని, 2019 ఎన్నికలలో రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పని చేస్తామని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాసనసభకు జరిగిన ఎన్నికలలో పొత్తు లేకుండా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వారమని ఆయన తెలిపారు. మహాకూటమి పేరుతో తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలతో పొత్తు పెట్టుకోవడం, బీసీలకు సముచిత స్థానం ఇవ్వకపోవడమే పార్టీ పరాజయానికి దోహదపడిందని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు అరోపించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో 40 శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినా రాష్ట్ర నాయకులు బీసీలకు సీట్లు కేటాయించలేదని మాజీ మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకెళ్లలేదని, ప్రజల విశ్వాసం పొందకపోవడమే కారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ వంటి అనేక ప్రాజెక్ట్‌లను 90 శాతం పూర్తి చేసిన కాల్వలలోనే టీ ఆర్ ఎస్ ప్రభుత్వం సాగునీరు అందించి మేమే చేశాం అని ప్రజలలో నమ్మకం కలిగించిందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో బీసీలకు సీట్లు కేటాయించకపోవడంతో ఘోర పరాజయానికి కారణమని ఆయన అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ తదితరులు ఉన్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియామకంతో
తెరాస శ్రేణుల సంబురాలు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 14: టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరో సంతోషకరమైన వార్త వినిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను నియమించడంతో ఒక్కసారిగా గులాబీ శ్రేణుల్లో మరింత ఉత్సహాన్ని నింపింది. శుక్రవారం కేటీఆర్ నియమాకాన్ని హర్షిస్తూ పాలమూరు పట్టణంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు కేక్‌ను కట్ చేసిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ శాసనసభా ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారని దాంతో ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గ్రామగ్రామాన విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో శుభవార్త అందించారని కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సింగిల్‌విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని జిల్లాలో స్థానిక సంస్థలను మళ్లీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీ ఆర్‌ను నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రాజేశ్వర్, శివరాజ్, సుదీప్, అంజనేయులు, ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ: టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్ ఎంపిక పట్ల శుక్రవారం మరికల్ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వై.వెంకట్రామిరెడ్డి, మరికల్ మండల రైతుకమిటి చైర్మన్ సంపత్‌కుమార్,మండల నాయకులు రామస్వామి, యూత్ అధ్యక్షులు సుధాకర్‌గౌడ్,మండల మైనార్టీ అధ్యక్షులు మతీన్‌సేట్, ఆశోక్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ధన్వాడ మండల నాయకులు చంద్రశేఖర్,నారాయణస్వామి, రాజావర్థన్‌రెడ్డి,రాజుయాదవ్,రాములు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేటలో..
మూసాపేట: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను ఎంపిక చేయడం పట్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రయ్య సాగర్ సీఎం కేసీఅర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల రైతు సంఘం అధ్యక్షుడు రఘపతిరెడ్డి, మార్కెట్‌కమిటి ఉపాధ్యక్షుడు శివరాములు, మాజి ఎంపిపి బగ్గికృష్ణయ్య, మాజి సర్పంచ్ బాస్కర్‌గౌడ్, మచ్చేంధర్, చంద్రయ్య, కోండయ్య, శర్మ, వెంకటేష్ పాల్గొన్నారు.
ట్యాంపరింగ్ అవాస్తవం