మహబూబ్‌నగర్

ప్రాజెక్టులను పూర్తి చేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 2: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కాలేశ్వరం, పాలమూరు,రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతో సహా వివిధ సాగునీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేసి నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఇట్టి పనుల పురోగతిని తెలుసుకునేందుకే తాము ప్రాజెక్టులను సందర్శిస్తున్నామని విశ్రాంత ఇంజనీయర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రవౌళి, ముత్యంరెడ్డి, వేణుగోపాల్, వెంకటేశంలు ఎస్‌ఎల్‌బీసీ పనులు జరుగుతున్న జిల్లాలోని దోమలపెంటకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి మనె్నవారిపల్లిలో జరుగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెండోవైపు జరుగుతున్న పనులను పరిశీలించారు. 40 కి.మీ పొడవున టన్నల్ తవ్వాల్సి ఉండగా దాదాపుగా రెండువైపుల కలుపుకొని 30 కి.మీ వరకు తవ్వి, సుమారు రూ.15వందల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, టన్నల్‌లో నీరు లీకేజీ అవుతుండటంతో పనులు జరగడంలేదని, నీటిని తోడెయ్యడంతోపాటు లీకేజీని అరికట్టి పనులను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈయేడాది చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వడం జరుగుతుందన్నారు. మంగళవారం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు, పంపుహౌజ్ నిర్మాణం కోసం టన్నల్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులోని మూడో లిప్టు గుడిపల్లి లిప్టు వద్ద నాలుగు మోటార్లను ప్రారంభిస్తే సర్జ్ఫిల్‌లో వాటర్ లేవల్ తగ్గిపోతున్న విషయం తెలియడంతో బుధవారం ఈ లిప్టు పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై సాంకేతిక నిపుణుల కమిటి సందర్శించి ఇక్కడి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు సంబంధించి టన్నల్ లైనింగ్, కాలువలు, బ్యాకింగ్ తదితర మిగులు పనులను పూర్తిచేసేందుకు అధికారులు ఆరునెలల సమయం కోరుతున్నారని, ఈ సయమంలో ప్రాజెక్టుకు సంబంధించిన మూడు లిప్టుల పంపులను పూర్తిగా ఆపేయాల్సి ఉందని, దీనిపై కూడా సీఎంకు నివేదికను ఇస్తామన్నారు. తాము సందర్శించిన ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై ఆధ్యాయనం చేసిన అంశాలతోపాటు ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు తెలిపిన వాటిని క్రోడీకరించి సమగ్రమైన నివేదికను రూపొందించి ఈనెల 4న సీఏంకు అందచేయనున్నట్లు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీటిపై సీఏం రాష్టస్థ్రాయి అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ ప్రాజెక్టులను సీఏం స్వయంగా సందర్శించి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదాం
* ప్రతి పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెడుతాం
* డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని గ్రామపంచాయతీతో పాటు వార్డు సభ్యులు, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని గ్రామస్థాయి నాయకులు, వార్డుమెంబర్లు, సర్పంచు అభ్యర్థులుగా తప్పకుండా నిలబడాలని అందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందన్నారు. టీ ఆర్ ఎస్ నాయకుల ఆగడాలను ఎదుర్కోంటామని వారు వేస్తున్న ఎత్తులను చిత్తు చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి గ్రామపంచాయతీలను బలవంతంగా ఏకగ్రీవాలకు టీ ఆర్ ఎస్ నాయకులు దిగే అవకాశం ఉందని ఎక్కడ కూడా టీ ఆర్ ఎస్ నాయకులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులను పోటీలో దింపుతున్నామని ఆయన వెల్లడించారు. శాసనసభ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఈ దిశగా ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, ఎన్‌పి వెంకటేష్, రంగారావు, కరుణాకర్‌గౌడ్, లక్ష్మణ్, యాదయ్య, బెనహర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలికి ఇంకు గుర్తు
నాగర్‌కర్నూల్, జనవరి 2:ఈనెలలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు జరిగే మూడు విడతల ఎన్నికలలో ఓటు వేసిన ఓటరుకు మధ్యవేలిపై ఇంకు గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలనే శాసనసభ ఎన్నికలు జరిగినందున ఓటు వేసిన వారి ఎడమ చేతి చూపుడు వేలికి వేసిన ఇంకు మార్కు ఇంకా వేలికి ఉండే అవకాశాలు ఉన్నందున పంచాయతీ ఎన్నికలలో ఎడమ చేతి మధ్యవేలికి ఇంకు మార్క్ పెట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి
అందరినీ కలుపుకొని పోదాం
* ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆమోదించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని గ్రామాల్లో వాతావరణాన్ని కలుషితం చేయవద్దని, గ్రామాలాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో అన్ని మండలాల ముఖ్యనేతలతో నిర్వహించిన ఆయన ప్రసంగించి పలు సూచనలు చేశారు. పార్టీల వారీగా ప్రజలను వీడదిసి గ్రామాలలో వర్గాలను పెంచి పోషించే సంస్కృతికి అడ్డుకట్ట వేద్దామని, ప్రజలతో చర్చించి ఎక్కువ మంది ప్రజలు సూచించిన వ్యక్తులకు అవకాశం ఇచ్చి వీలైనంత వరకు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవానికి ప్రయత్నించాలని , అనివార్య పరిస్థితిలో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ప్రజలకు సమస్యను వివరించి వారి మద్దతును పొందే ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరు గెలిస్తే గ్రామాభివృద్ధి జరుగుతుంది, ఎవరు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించగలుగుతారు అన్న విషయాన్ని ప్రజలతో చర్చించి వారు సూచించిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఎవరు దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని ఆయన సూచించారు. ముఖ్య నేతలు గ్రామాల వారిగా ఎక్కువ మంది ప్రజలను కలిసి వారితో చర్చించాలని , పార్టీలో ఉన్న నేతలు అంతా ఒక తాటి మీద ఉండి ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

31 పంచాయతీల్లో 26 ఎస్టీలకే..
* సరైన అభ్యర్థుల కోసం చర్చలు
* తండాల్లో ఏకగ్రీవానికి సమావేశాలు

అచ్చంపేట, జనవరి 2: పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో కొత్త గ్రామ పంచాయాతీల్లో చర్చలు మొదలవుతున్నాయి. మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో 26 గ్రామ పంచాయతీలు ఎస్టీలకే రిజర్వు అవడంతో మండలంలో వారికే అగ్రభాగం కేటాయించారు. అందుల్లో ఏజేన్సి ప్రాంతంలో ఉన్నా 18 పంచాయతీలు ఎస్టీలకు మరో 5 పంచాయతీలు వందశాతం గిరిజనుల జనాభా ఉండండతో వారికే కేటాయించడంతో పాటుప్లేన్ గ్రామాల్లో ఆరుశాతం జనాభా ప్రతిపాదికతన మరో మూడు పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. 4 జనరల్ , 1 ఎస్సీలకు కేటాయించారు. బుధవారం మండల పరిధిలోని బుడ్డతాండ, పెద్దతాండ గ్రామ పంచాయతీల్లో సరైన సర్పంచ్ అభ్యర్థుల కోసం చర్చలు జరిగాయి. మిగతాగ్రామపంచాయతీలలోకూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అన్ని రంగాల్లో బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. కొత్తగాగ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ తాండల్లో ఏకగ్రీవాల కోసం సమావేశాలు జరుగున్నాయి. అనంతరం పలువురు తాండ నాయకులు మాట్లాడుతూ తమ తాండను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఎన్నికలు నిర్వహించి స్వయం పరిపాలనకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
పంటకోత ప్రయోగాలపై అవగాహన
* హాజరైన సీపీవో, డీఏవో

నాగర్‌కర్నూల్, జనవరి 2: వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా పంటకోత ప్రయోగాలపై బుధవారం ఎఈవోలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డిలు పాల్గొని పలు అంశాలపై వివరించారు. ఈ సీజన్‌లో జిల్లాలో వేరుశనగ పంటను యూనిట్‌గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 227 యూనిట్ల పంట కోత ప్రయోగాలు చేయుటకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో చేసిన పంట కోత ప్రయోగాలకు సంబందించిన అన్ని వివరాలను కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వందశాతం నమోదు చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎడీఎలు, జిల్లా , డివిజన్ గణకాంల అధికారులు పాల్గొన్నారు.
నాలుగేళ్లుగా ముందుకు సాగని ఆర్వోబీ పనులు
* నిర్మాణం కాకముందే కూలిన దిమ్మెలు
*నాణ్యతపై పలు అనుమానాలు
* గడువును పొడిగించుకుపోతున్న అధికారులు
* నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు
* కలెక్టర్ ఆదేశించినా ఫలితం శూన్యం
గద్వాల, జనవరి 2: ఆర్వోబి నిర్మాణం సంవత్సరాల తరబడి కొనసాగుతున్నది. ఒకవైపు పనులు జరుగుతుండగా మరోవైపు నిర్మించిన సిమెంటు దిమ్మెలు కూలిపోయాయి. ఎంతో నాణ్యతతో పకడ్బందిగా అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆర్వోబి నిర్మాణ పనులు కాంట్రాక్టర్, జిల్లా అధికారుల నిర్లక్ష్యకారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చి ఆర్వోబి నిర్మాణం చేస్తుండడంతో ఒకవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు నిర్మించిన ఆర్వోబి దిమ్మెలు కూలిపోయాయి. దీంతో ఆర్వోబి నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఒకవైపు జిల్లా కలెక్టర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్, జిల్లా ఆర్‌అండ్‌బి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రెండు, మూడు రోజులకే సిమెంటు దిమ్మెలు కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పనులను తక్కువరేట్లకు దక్కించుకొని పనులు చేయకుండా సంవత్సరాల తరబడి పొడగించుకుపోయి ఇప్పుడు అధికారులు సీరియస్ కావడంతో పనులను వేగవంతం చేయాల్సింది పోయి నాణ్యతవై అనుమానాలు కలిగేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాణ్యతకు తిలోదకాలు..
దేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించి పలు పట్టణాలలో ఆర్వోబిలు కూలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గద్వాల పట్టణంలో నిర్మిస్తున్న ఆర్వోబి పనులు ఆది నుంచి నాణ్యత పాటించడంలేదని పట్టణ ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకులు నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా పర్యవేక్షించే వారు లేరని ప్రజలు మండిపడుతున్నారు. గత ఏడాది రైల్వే బ్రిడ్జి గోడలకు పెట్టు సిమెంటు దిమ్మెలు పడి ఒక్కరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో సిమెంటు గోడలు కూలడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు ఎలాంటి నాణ్యత పాటించకపోవడంతో ఇటీవల బ్రిడ్జి గోడలు కుప్పకూలాయంటే ఆర్వోబి నిర్మాణ నాణ్యత ఏవిధంగా పాటించారో అర్థమవుతుంది.
గేటు పడటంతో ప్రయాణికుల నరకయాతన..
నిత్యం హైదరాబాద్ నుండి గద్వాల మీదుగా తిరుపతి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు రైళ్లు వెళ్తుంటాయి. మొదటి రైల్వే గేటు ప్రాంతంలో ఆర్వోబి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండో రైల్వే గేటు మీద వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రైళ్ల రాకపోకలతో రెండవ రైల్వే గేటు పడిన ప్రతిసారి వాహనదారులు గంటల తరబడి ఆగాల్సివస్తుంది. అత్యవసర సమయాల్లో కర్నూల్, హైదరబాద్ ఆసుపత్రులకు వెళ్లు రోగులు కూడా ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. మొదటి రైల్వే గేటు ప్రాంతంలో నిర్మిస్తున్న ఆర్వోబి పూర్తి అయితే కాని ప్రజలకు, వాహనదారులకు ఈసమస్య నుంచి విముక్తి లభించదు.
ఆర్వోబి నిర్మాణంలో నిర్లక్ష్యం..
గద్వాల పట్టణంలోని ఆర్వోబి నిర్మాణ పనుల కోసం రూ. 23కోట్లు మంజూరయ్యాయి. జనవరి 8, 2014 కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈపనులు 2016 జనవరి 7వ తేది నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. కాని తనకు మరో ఏడాది గడువుఇస్తే పూర్తి చేస్తానని అధికారులను కోరిన ఒప్పందం తేదీ ముగిసినప్పటి నుంచి నేటి వరకు 3 ఏళ్లు అవుతున్నా కాంట్రాక్టర్ పనులను ఎంతటికి పూర్తి చేయడం లేదు.
ఆర్వోబి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని అనేక సార్లు ఆర్వోబి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకవచ్చిన ఏమాత్రం చలనం లేదు. గతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనేక సార్లు రోడ్లు, భవనాలు, కాంట్రాక్టర్లతో ఆర్వోబి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు చేసిన పూర్తి చేయలేకపోయారు. గడువు మీద గడువు కోరిన పూర్తి చేస్తామన్నా ఆర్వోబి నేటి వరకు కూడ అసంపూర్తిగానే మిగిలింది. అసలు కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ పనులను తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, దాంతో పాటు పనులను దక్కించుకునేందుకు పోటికి పోయి ఆర్‌అండ్‌బి శాఖ కోడ్ చేసిన అంచనాలకంటే తక్కువ ధరకు టెండర్ వేయడం వల్లే పనులను పూర్తిచేయలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కలెక్టర్, రాష్ట్ర అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పనులు పూర్తికి కృషి చేయాలి
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు, ఆ పార్టీ నాయకులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసినా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.