మహబూబ్‌నగర్

భయం గుప్పెట్లో అభంగాపూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, జనవరి 11: పగలు, ప్రతీకారాలు, హత్యలతో గత పాతిక సంవత్సరాలుగా అట్టుడుకుతున్న అభంగాపూర్ గ్రామం తాజాగా ఆశప్ప అలియాస్ అశోక్‌పై ఎన్నికల వేళ జరిగిన దాడి నేపథ్యంలో అట్టుడుకి పోతోంది. పాతికేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వైరం నేటికి చల్లారకపోవడం విశేషం. గత కొంతకాలంగా గ్రామంలో ఎలాంటి విభేధాలు లేకుండా ఉన్నా ఆశప్పపై గత రెండు రోజుల క్రితం మరికల్ మండల కేంద్రం సమీపంలో మారణాయుధాలు, వేటకొడవళ్లతో దాడి చేయడంతో గ్రామం అట్టుడుకిపోతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంతుచిక్కక గ్రామస్థులు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి గ్రామంలోని తమ బంధువుల వద్దకు వచ్చేందుకు సైతం గ్రామానికి చెందిన వారి బంధువులు వెనకంజ వేస్తున్నారు. అయితే గ్రామంలో గత మూడు రోజులుగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నా గ్రామస్థులు మాత్రం భయం నీడన కాలంగడుపుతున్నారు. గ్రామానికి చెందిన అనేక మంది తమ సెల్‌ఫోన్లను సైతం స్విచాఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అభంగాపూర్ ఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూతగాదాల నేపథ్యంలో 1996లో చెన్నప్ప వర్గం, ఆశప్ప అలియాస్ అశోక్ వర్గాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఆశప్ప వర్గం పైచేయిగా ఉండగా తాజాగా మరికల్ వద్ద జరిగిన హత్యాయత్నం ఘటన గ్రామస్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 1996లో ఆశప్ప అలియాస్ అశోక్ తన ఇంటికి రోడ్డు వేయించుకోగా అది గిట్టని మాజీ సర్పంచ్ చెన్నప్ప అడ్డుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు రేగాయి. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఆశప్ప వెళ్లగా చెన్నప్ప అతడిపై దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతారు. సిపిఐ(ఎంఎల్) నేతలు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. తదనంతరం 1996లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెన్నప్ప మరోమారు సర్పంచ్‌గా గెలవడంతో రెండు వర్గాల మధ్య విభేధాలు తీవ్రమయ్యాయి. ఈ సమయంలోనే చెన్నప్ప ఇంటిపై బాంబుదాడి జరిగింది. ఈ కేసులో ఆశప్ప పాత్ర ఉందని అప్పట్లో కేసు నమోదైంది. ఎలాగైనా ఆశప్పను హతమార్చాలనే ఉద్దేశ్యంతో చెన్నప్ప వర్గం వారు దాడి చేయాలని ప్రయత్నించగా ఆశప్ప తప్పించుకున్నారు. 2001జూన్ 10న కోయిల్‌కొండ మండలం వింజమూరు గ్రామ సమీపంలో అభంగాపూర్‌కు వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న గుండప్ప, వెంకటప్ప అనే యువకులు చెర్లపల్లి స్టేజ్ సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆశప్ప వర్గీయులపై కేసు నమోదైంది. అప్పటి నుండి ఆ వర్గం గ్రామాన్ని వదిలారు. అయితే ఎలాగైనా సరే ఆశప్ప వర్గాన్ని అంతమొందించాలని చెన్నప్ప వర్గీయులు 2002 ఏప్రిల్ 3న నారాయణపేట కోర్టు దగ్గర మాటు వేసి హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే చెన్నప్ప వర్గానికి చెందిన రాములు, దస్తప్ప, దేవప్ప, వెంకటప్ప, నారాయణ, నర్సిములు కోర్టు ప్రాంగణంలోనే తిష్టవేశారు. కోర్టుకు హాజరైన జక్కన్నగారి రాములు వీరి కదలికలను పసిగట్టి అప్పటి కోర్టు కానిస్టేబుల్ భీంరెడ్డికి సమాచారం అందించగా అప్పటి డిఎస్పీ సత్యనారాయణ, సిఐ పాండునాయక్, ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ బాలయ్య, అంజిలయ్య, ముస్తాక్‌లు జాగ్రత్తపడి వారిని పట్టుకుని కోర్టు ప్రాంగణంలో దాచిపెట్టిన వేటకొడవళ్లు, బాంబులు, నాటు తపంచాను స్వాధీనం చేసుకుని ఈ ఘటన నుండి ఆశప్ప వర్గీయులను రక్షించారు. అయితే 2004 మార్చి 18న నారాయణపేట కోర్టుకు హాజరవుతున్న నారాయణ, పెద్ద దస్తప్ప, చిన్న దస్తప్ప తదితరులు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆశప్ప వర్గీయులు అప్పక్‌పల్లి గ్రామ సమీపంలో మాటు వేసి మారణాయుధాలతో దాడి చేయగా నారాయణ, పెద్ద దస్తప్పలు మృతి చెందారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య మళ్లీ కక్షలు పెరిగాయి. తాజాగా మరికల్ సమీపంలో చెన్నప్ప వర్గీయుడైన విజయ్‌కుమార్ తన అనుచరులతో కలసి ఆశప్పపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచే ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా గ్రామ ప్రజలు గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ భయాందోళనల మధ్య బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఆవుకు కవల దూడల జననం
బిజినేపల్లి, జనవరి 11: మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన చిన్నగల్ల రాజు అనే రైతుకు చెందిన పాడి ఆవు కవల లేగదూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆవుకు ఒక మగ, ఒక ఆడ దూడలు పుట్టడం పట్ల రైతు రాజు ఆనందం వ్యక్తం చేశారు. కవల దూడలను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఘనంగా గోపూజ కార్యక్రమం
ధన్వాడ, జనవరి 11: మరికల్ మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర దేవాలయం వారి అధ్వర్యంలో గోపూజ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈపూజ కార్యక్రమాన్నికి గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ప్రజలు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలు మొక్కలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర , హిందూ ధర్మ ప్రచార కమిటిసభ్యులు నాగ శివలక్ష్మీ, మరికల్ గ్రామస్తులు సీమరాములు, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆనంద్‌కుమార్, సాయప్ప, శివ, రాయుడు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్లు షూరూ

మహబూబ్‌నగర్, జనవరి 11: పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల కోలహలం కొనసాగుతుంది. మొదటి విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తికాగా నామినేషన్ల పరిశీలన సైతం ముగిసింది. ఇక శుక్రవారం రెండవ విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండవ విడతలో 22 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 546 గ్రామపంచాయతీలకు, 4838 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 15వ తేదీన అభ్యంతరాల స్వీకరణ, 16న అభ్యంతరాలపై విచారణ 17న అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. 25వ తేదీన రెండవ విడతలోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా శుక్రవారం కావడంతో మంచి మహుర్తంగా భావించిన నాయకులు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యులకు పోటీ చేసే ఆశవాహులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. రెండవ విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 243 గ్రామపంచాయతీలు, 2068 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని 8 మండలాల్లోని 141 గ్రామపంచాయతీలకు, 1240 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాల పరిధిలోని 74 గ్రామపంచాయతీలకు, 716 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వనపర్తి జిల్లాలో 5 మండలాల పరిధిలోని 88 గ్రామపంచాయతీలకు, 814 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు జిల్లాలో రెండవ విడతలోజరగనున్న పంచాయతీ ఎన్నికలు 22 మండలాల పరిధిలోని 546 మండలాలు, 4838 వార్డులకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు రెండవ విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, తాడూరు, తెలకపల్లి, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, మదనాపురం, పెద్దమందడి, జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో రెండవ విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండవ విడతలో మొదటి రోజు నామినేషన్లు దాదాపు 846 దాఖలు అయ్యాయి. 1846 నామినేషన్లు ఉమ్మడి జిల్లాలో వార్డు సభ్యులకు నామినేషన్లు వేశారు. కాగా నామి
నేషన్ల స్వీకరణ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు ఎప్పటికప్పుడు క్లస్టర్ల దగ్గరకు వెళ్లి బందోబస్తును నిర్వహించారు.

నేటి నుంచి శ్రీశైలంలో
మకర సంక్రమణోత్సవాలు

శ్రీశైలంప్రాజెక్టు, జనవరి 11: మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 12నుంచి 18 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి తెలిపారు. ఈ భ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆలయంలో పంచాహానిత, దీక్షాయుత పుశ్యశుద్ద షష్టి జనవరి 12 ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభించి శివ సంకల్పం, గణపతి, చండీశ్వరుని పూజలు, కంకణధారణ, అఖండ దీపారాధన, పూజాహోమము, సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 వరకు ప్రతిరోజు స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు జరుగుతాయని, 17 ఉదయం రుద్రయాగం, తీర్థోత్సవం, 18న పుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 15న మకర సంక్రాంతి రోజున స్వామి, అమ్మవారి కళ్యాణోత్సవం జరుపనున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులు ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. 13న భృంగివాహన సేవ, 14న రావణవాహన సేవ, 15న నందీవాహన సేవ, 16న పుష్పపల్లకి సేవ, 17న పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న అశ్వవాహన సేవలు జరగనున్నట్లు తెలిపారు. బ్రహోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు జరిగే శాశ్వత ఆర్జీతసేవలు నిలిపివేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.