మహబూబ్‌నగర్

వ్యాపారంగా మారిన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, మే 22: దేశంలో విద్య వ్యాపారంగా మారిందని,గత 20 సంవత్సరాలలో విద్య ఇలా ఉండేది కాదని మద్యప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు బస్వనాధ్ పాటియా అన్నారు. ఆదివారం పట్టణ సమీపంలో గల అక్షర వనంలో 8 రాష్ట్రాల ఎన్‌జిఓ, విద్యావేత్తలతో తమ అనుభావాలను పంచుకునేందుకు రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మద్యప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు బస్వనాధ్‌పాటియా మాట్లాడుతు విద్య వ్యాపారంగా మారిందని,గతంలో విద్య ఇలా ఉండేది కాదని, విద్య అనేది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవిధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అక్షర వనం నిర్వహకులు మాధవరెడ్డి మాట్లాడుతు ఎన్‌జిఓ, విద్యావేత్తలు తమ అనుభావాలను అక్షరవనంలోని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు అక్షర వనంలోని విద్యార్థులతో, ఉపాద్యాయులతో, నిర్వహకులతో వారు అక్షరవనం యొక్క పనితీరు దేశ వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా తాడూర్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రచించిన విద్య సందేశాల పుస్తకాలను రాజ్యసభ సభ్యుడు బస్వనాధ్ పాటియా చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సజయ్‌పటేల్ బాంబే, శ్రీమహేష్ శర్మ సామాజిక కార్యకర్త మధ్యప్రదేశ్, శ్రీనివాసశర్మ వైస్ ప్రిన్సిపాల్ సిబి ఐటి హైద్రాబాద్,ఉపేందర్ ప్రొఫెసర్ ఎస్‌సిఆర్‌టి, వందేమాతరం పౌండేషన్ సభ్యులు శ్రీపతిరెడ్డి, జగన్ పాల్గొన్నారు.