మహబూబ్‌నగర్

పాలమూరు జిల్లాకు తలమానికం ‘షాద్‌నగర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 23: మహబూబ్‌నగర్ జిల్లాకు తలమానికగా ఉన్న ‘షాద్‌నగర్’ను హైద్రాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో కలిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఆర్ధిక పరంగా, రెవిన్యూ పరంగా అన్ని విధాల అభివృద్ది సాధించిన షాద్‌నగర్ నియోజకవర్గాన్ని హైద్రాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో కలిపేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పాలన సౌలభ్యానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నాయి, షాద్‌నగర్‌ను మాత్రం జిల్లా నుండి విడగొట్టి ఇబ్రహీంపట్నంలో కలిపించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌తో పాటు అదనంగా వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అయినప్పటికి షాద్‌నగర్‌ను మాత్రం విడగొట్టి మరో ప్రాంతంలో కలపడం సరైన పద్దతి కాదని ఆరోపించానరు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని ఇబ్రహీంపట్నంలో కలపడం వల్ల కొందుర్గు, కేశంపేట ప్రజలు అంతదూరం వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే షాద్‌నగర్‌ను ఇబ్రహీంపట్నంకు తరలించేందుకు సిద్దం చేస్తున్నారని, రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు హెచ్చరించారు. షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా ఉద్యమాలు చేషామో అదే తరహాలో షాద్‌నగర్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండే విధంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్వారా సిఎం కెసిఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లనున్నట్లు వివరించారు. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్, ఎంపిటిసి సభ్యుడు రాఘవేందర్‌గౌడ్, కౌన్సిలర్లు విజయ్‌కుమార్‌రెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్‌గౌడ్, దంగు శ్రీనివాస్ యాదవ్, వై.యాదయ్య యాదవ్, ఒగ్గు కిశోర్, మధు, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.