మహబూబ్‌నగర్

ఉద్యమ కసితో చదివి ఉద్యోగాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట: 60యేళ్లుగా ఆంధ్రాపాలనలో విసుగెత్తి పోరాడితెచ్చుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో చదివి ఉద్యోగాలు సాధించాలని సంకల్పంతో కురుమూర్తిరాయ స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 20రోజులుగా పట్టణంలో యువతీ యువకులకు ఎస్సై, కానిస్టేబుల్, ఫైర్స్ సిబ్బంది నియామకాలకుగాను నిరుద్యోగులకు ఉద్యోగాలకోసం ఏవి ఆర్ ట్రస్టు ఆద్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. అందుకుగాను సుమారుగా 10లక్షలు వెచ్చించి ఉచితంగా కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. నియోజకవర్గ యువతీ యువకులకు ఒక్కపిలుపుతో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రస్తారోకోలు చేశారని, వారి రుణం తీర్చుకునేందుకే ఉద్యోగ ప్రకటనలు వెలువడిన వెంటనే వారికి ఏదోవిధంగా సాయం చేయాలనే సంకల్పంతో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు ఆసరగా ఉండాలని సంకల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకుని, తమ తలిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలని ఆయన అన్నారు. శిక్షణ నెలరోజుల పాటు కొనసాగుతుందని, మధ్యాహ్న భోజనం, స్టడీ మెటిరీయల్స్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వారం కోచింగ్ సెంటర్‌కు వచ్చిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. మంచి మార్కులు సాధించి ఈ కోచింగ్ సెంటర్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్ నుండి నిపుణులచే కోచింగ్ ఇస్తున్నట్లుతెలిపారు. సాయంత్రం వారికి స్నాక్స్, టీలు కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

సజావుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు
* 43 పరీక్షా కేంద్రాల్లో హాజరుకానున్న 8714 మంది విద్యార్థులు * 5నిమిషాల కంటే ఆలస్యమైతే నో ఎంట్రీ
* ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ * డిప్యూటీ డిఇఓ వాహిద్ నిస్సార్ అహ్మద్
మక్తల్, మార్చి 20: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఈ విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు వ్రాసేందుకై నారాయణపేట డివిజన్‌లో ఏర్పాట్లన్ని పూర్తి చేశామని, వీటికై 42 రెగ్యూలర్, ఒక ప్రైవేట్ సెంటర్‌ను ఏర్పాటు మొత్తం 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటి డిఇఓ వాహిద్ నిస్సార్ ఆహ్మద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్ మొత్తంలో 35 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, మిగిలిన 8 సెంటర్లు ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయడమైయ్యిందని చెప్పారు. ఈవిద్యాసంవత్సరం పరీక్షలు రాయబోయే విద్యార్థులు 8714 మందికాగా, వీరిలో బాలురు 4485 మంది, బాలికలు 4229 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు చెప్పారు. అలాగే ఓకేషనల్‌కు చెందిన విద్యార్థులలో 169 మంది బాలురు, 50 మంది బాలికలు మొత్తం 219 మంది పరీక్షలు వ్రాస్తున్నట్లు తెలిపారు. వన్స్ ఫేయిల్ విద్యార్థులలో బాలురు 84, బాలికలు 43, మొత్తం 127 మంది ఇంకా ఉన్నట్లు చెప్పారు.
ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-30గంటల వరకు పరీక్షలు నిర్వహించబడుతుందని డిప్యూటీ డిఇఓ వాహిద్ నిస్సార్ ఆహ్మద్ తెలిపారు. కాగా పరీక్ష సమయానికంటే అరగంట ముందే అనగా 9-00గంటలకే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పరీక్ష ప్రారంభం అయ్యాక 5నిమిషాల ఆలస్యం వరకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. తదుపరి వచ్చిన విద్యార్థులను అనుమతించడం జరుగదని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. విద్యార్థులు పరీక్షా హాలుకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తూవులను అనుమతించరన్న విషయాన్ని గమనించాలని తెలిపారు.
ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లు...
2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు రానే వచ్చాయి. ఈనెల 21నుండి వచ్చేనెల ఏప్రిల్ 7వరకు కొనసాగనున్నట్లు పేట డివిజన్ డిప్యూటీ డిఇఓ తెలిపారు. ఇందుకుగాను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10వ తరగతి విద్యార్థుల హాల్‌టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో పెట్టినట్లు ఆయన చెప్పారు.
డివిజన్ మొత్తంలో విద్యార్థులు పరీక్షలు వ్రాసేందుకై అన్నీ ఏర్పట్లను పకడ్బందిగా చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా 10వ తరగతి పరీక్షా హాలులో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికి ఉపాధ్యాయుల యూనియన్ నుండి తీవ్ర వత్తిడి రావడంతో ప్రభుత్వం విరమించుకొన్నట్లు తెలిపారు. 43 పరీక్షా కేంద్రాలకుగాను 86 మంది ఛీప్ సూపరిండెంట్‌లు, డిపార్ట్‌మెంట్స్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఆలాగే 9మంది చీఫ్ కస్టోడియన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నారాయణపేట డివిజన్‌లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నడిచే విదంగా అందరు సహకరించాలని ఆయన కోరారు.
రుమాండ్ల సేవలు మరవలేనివి
* రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తం
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 20: రుమాండ్ల రామచంద్రయ్య సమాజానికి చేసిన సేవలు మరవలేనివని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్ల పురుషోత్తం అన్నారు. ఆదివారం పద్మశాలి కళ్యాణ మండపంలో మాజి రాజ్యసభ సభ్యుడు రుమాండ్ల రామచంద్రయ్య సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుమాండ్ల చేసిన సేవలు మరవలేనివని ఆయన మరణం పద్మశాలి సమాజానికి తీరని లోటన్నారు. జిల్లాలోని పద్మశాలి సమాజానికి చేసిన సేవలు విస్మరింపరావని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పద్మశాలి కళ్యాణ మండపాలను నిర్మించడం గొప్ప విషయమని అలాగే పాఠశాల, కళాశాల భవనాలను అత్యధిక సంఖ్యలో రుమాండ్ల నిర్మించారని కోనియాడారు. జిల్లాలో రాజకీయంగా పేరుగాంచిన వారు ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం బాధకరమని రుమాండ్ల రామచంద్రయ్య విద్యార్థి దశ నుండే ఎదిగిన నేత అని అన్నారు. రుమాండ్ల మహిళలను రాజకీయంగా ఎదగాలని కోరేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాపుజీ, రాష్ట్ర కోశాదికారి గడ్డం వెంకటేష్, జిల్లా కోశాదికారి నామాల రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి బీంపల్లి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు రాంచంద్రయ్య, సత్యనారాయణ, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.