మహబూబ్‌నగర్

మిషన్ కాకతీయతోనే చెరువులకు పునర్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 5: మహబూబ్‌నగర్ మండల పరిధిలోని బోయపల్లి గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన మిషన్ కాకతీయ చెరువు పునరుద్దరణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పనుల్లో కూలీలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పశువులను రోగాల బారి నుండి కాపాడుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గాలికుంటువ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు నెలలకొసారి పాడిపశువుల సంరక్షణ కోసం గాలికుంటువ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. పాడి పశువులు పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువుల్లో శక్తితగ్గిపోవడం, గిట్టలు ఊడిపోవడం లాంటి సమస్యలతో పశువులు రోగాల బారిన పడకుండా సంరక్షించేందుకు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. రైతుల పశువులకు ఉచితంగా టీకాలు ఇస్తునందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాండల్లో నెలకొన్న సమస్యలు విధిదీపాలు, సిసిరోడ్లు, డ్రైనేజీలు, మరుగుదోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, క మిషనర్ దేవ్‌సింగ్‌నాయక్, టిఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.