మహబూబ్‌నగర్

కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 20: జూరాలకు జలకళ మళ్లింది. రైతుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా గత మూడు నాలుగు దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న సాగునీటి కల నేరవేరనుంది. గత 14 సంవత్సరాల క్రితం ప్రారంబించిన పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వం జూరాల ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పంపుల ద్వారా సాగునీటిని విడుదల చేసి ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఈ నీటిని భీమా ప్రాజెక్టుకు వదిలారు. బీమా పంప్‌లను ప్రారంభించి అక్కడి నుండి శంకర సముద్రం రిజర్వాయర్‌ను కృష్ణాజలాలతో నింపనున్నారు. అంతేకాకుండా జూరాల బ్యాక్ వాటర్‌తో నెట్టెంపాడుకు నీటి తరలింపు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు జూరాల బ్యాక్ వాటర్ నుండి ఎత్తిపోసి నీటిని తరలించనున్నారు. 1000 క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోసేందుకు సర్వం సిద్ధ్దం చేశారు. నెట్టెంపాడుకు 700 క్యూసెక్కుల నీటిని జూరాల నుండి మళ్లించేందుకు అధికారులు సర్వం సిద్ధ్దం చేశారు. నేడు మంత్రి హరీష్‌రావు పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా కొన్ని పంపులను ప్రారంభించి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించేందుకు రిజర్వాయర్లను నింపనున్నారు. ఈ ఖరీఫ్‌లో 4.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి తమ పొలాల్లోకి కృష్ణా జలాలు పారాలని ఎదురుచూస్తున్న జిల్లా రైతాంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. మరికొన్ని గంటల్లో రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు రావడం దాంతో వెనువెంటనే రైతుల పొలాల్లోకి సాగునీటిని విడుదల చేయనున్నారు. జూరాల ప్రాజెక్టులోకి ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుండి 6000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 57022 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఆల్మట్టిలోకి ఇన్‌ప్లో45873 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ డ్యాం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ డ్యాంలోకి వరదనీరు భారిగా వచ్చి చేరుతుంది. ఆల్మట్టికి, నారాయణపూర్ కన్న తక్కువ వరద ఉన్నప్పటికిని నారాయణపూర్‌కు మాత్రం 57022 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. ఇదే వరద మరో రెండు రోజులు వస్తే జూరాలకు యధాతదంగా వరద వస్తుంది. దినిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల గేట్లను ఎత్తివేసి వరదనీటిని వదలనున్నారు. జూరాల ప్రాజెక్టులోకి కృష్ణా బ్రిడ్జి దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.