మహబూబ్‌నగర్

ముంపు బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 8: నెట్టెంపాడు ప్రాజెక్టు ముంపుగ్రామమైన ఆలూరు గ్రామస్థులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్టప్రంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామి ఇచ్చారు. సోమవారం ధరూరు మండలంలోని ర్యాలంపాడు, ఆలూరు గ్రామాలను సందర్శించిన మంత్రి ముందుగా ధరూరు మండల కేంద్రంలోని చెరువు గెట్లపై హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం ఆలూరు గ్రామానికి చేరుకొని గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ముంపుకు గురైన ఆలూరు గ్రామ ప్రజలకు అన్నిరకాలుగా నష్టపరిహారం చెల్లిస్తామని హామి ఇచ్చారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాన్ని నిర్మించి అన్నిరకాల వసతులు కల్పిస్తుందని, వెంటనే గ్రామం ఖాళీ చేయాలని సూచించారు. నెలలోపు ప్రతి నిర్వాసిత కుటుంబానికి అన్ని రకాల నష్టపరిహారం బిల్లులు చెల్లించేలా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ర్యాలంపాడు రిజర్వాయర్‌కు చేరుకొని గంగపూజ నిర్వహించి కాలువలకు నీటిని విడుదల చేశారు. గత ఏడాది కంటే ఈ సారి వర్షాలు సకాలంలో కురిసి రిజర్వాయర్లు నిండాయని దీంతో కాలువలకు నీటి విడుదల చేయడం వల్ల ఈ ఖరీఫ్‌లో పంటలు భాగాపండే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రాజెక్టుల నుంచి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు తాగునీటిపై సరైన దృష్టిసారించలేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వచ్చాక మూడేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక రూ.35కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేశంలో ఎక్కడాలేని విధంగా తక్కువ ఖర్చుతో అతితక్కువ కాలంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, జడ్పిటిసిలు పద్మ, శ్యామల, ఎంపిపి సుభాన్, నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.