మహబూబ్‌నగర్

అభ్యంతరాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ప్రక్రియపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలపై అభ్యంతరాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. కాకపోతే మండలాల విషయంలో కొన్ని గ్రామాలను తమకు అనుకూలంగా ఉన్నటువంటి మండలాల్లో కలపాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇది ఇలా ఉండగా వనపర్తి జిల్లాపై అభ్యంతరాలు ఇప్పటికే దాదాపు రెండు వేలపైగా వచ్చాయి. గద్వాల జిల్లా కోసం నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం నడిగడ్డ ప్రాంతంలోని గద్వాల పట్టణం, ధరూర్, అయిజ, మల్దకల్ తదితర మండలాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో గద్వాల జిల్లా కోసం పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిర్యాదుల వెల్లువ దాదాపు 600లకుపైగా ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చేరాయి. అందులో గద్వాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతతో పాటు జిల్లాకు కావల్సిన అర్హతలు వంటి అంశాలను విద్యార్థులు, ప్రజలు అందులో పొందుపరిచారు. వనపర్తి తమకు వద్దంటూ నేరుగా అభ్యంతరాల్లో వ్యక్తం చేశారు. గద్వాలలో జరుగుతున్న నిరసనల హోరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించినట్లు కనబడుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గద్వాలపై ఆలోచనలో పడ్డట్లు కూడా అధికార వర్గాల సమాచారం. ఇది ఇలా ఉంటే కల్వకుర్తి డివిజన్ కోసం నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి దీక్ష శిభిరంలో పాల్గొని ప్రసంగించారు. కల్వకుర్తి మున్సిపల్ సమావేశంలో డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి జె ఎసి నాయకులకు అందజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్యాక్స్ ద్వారా జెఎసి నాయకులు పంపారు. అయితే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవరక6ద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు మంగళవారం రెవెన్యూ స్పెషల్ సెక్రెటరీ ప్రదిప్‌చంద్రను కలిసి అభ్యంతరాలకు సంబందించిన మేమోరండంను సమర్పించారు. అయితే ఇంటులో మహబూబ్‌నగర్ జిల్లాకు జూరాల ప్రాజెక్టులో సమాన హక్కులు కల్పించాలంటూ ఎమ్మెల్యేలు కోరారు. ఇది ఇలా ఉంటే మహబూబ్‌నగర్ మండల పరిధిలోని పత్తెపూర్ గ్రామాన్ని మహబూబ్‌నగర్ మండలంలోనే ఉంచాలంటూ నవాబుపేటలో చేర్చవద్దంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు. చిన్నచింతకుంట మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచుతూ పెద్దమానుగల చెడు, చిన్న మానుగల చెడు గ్రామాలను అడ్డాకుల మండలంలో చేర్చాలని, అదేవిధంగా గాజులపేటను సైతం యదాతథంగా అడ్డాకుల మండలంలో ఉంచుతూ ఇప్పలపల్లిని భూత్పుర్ మండలంలో ఉంచాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. చింతరెడ్డిపల్లి, మిట్టనందిమళ్ల, ఈర్లదినె్న, నాగిరెడ్డిపల్లి, బిక్కర్‌పల్లిలను ఆత్మకూర్ మండలంలో ఉంచాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. దింతో అధికార పార్టీకి సంబందించిన ముగ్గురు ఎమ్మెల్యేలు జూరాల ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లాకు సమాన హక్కులు కల్పించాలంటూ ఈ అంశాన్ని తెరపైకి తెవడంతో చర్చనీయాంశంగా మారింది. ఏది ఎమైన గద్వాల జిల్లా కోసం ఆ ప్రాంత ప్రజలు పోరుబాట పట్టారని చెప్పవచ్చు.