మహబూబ్‌నగర్

చరిత్రను కనుమరుగు చేస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రలను కనుమరుగు చేస్తున్నారని తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమైన చర్య అని ఆయన చరిత్రను ఉల్టా చేస్తున్నారని బిజెపి జాతీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాజాకారుల చేరసాల నుండి తెలంగాణ ప్రజలకు విమోచనం కలిగి భారతదేశం యొక్క స్వేచ్చ సాతంత్య్ర వాయువును పీల్చుకున్న దినాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించకపోవడం విడ్డురంగా ఉందన్నారు. సెప్టెంబర్ 17వ తేది ఆసలు సి ఎంకు ఎలాంటి అడ్డంకులు వస్తున్నాయని జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే అవకాశం ఇవ్వకపోవడంలో వెనుకంజ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరికి భయపడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఎంఐఎంకు భయపడి చరిత్రను ఉల్టా చేస్తున్నారని ద్వజమెత్తారు. తిరంగయాత్ర సెప్టెంబర్ 3న పాలమూరు పట్టణంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అయ్యార్ ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. బిజెపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తిరంగయాత్ర బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రాజెక్టులలో కోట్లాది రుపాయల అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరిదైన పాపం పండే రోజు ఉంటుందని అయితే మరో ఏడాదిలోపు టిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న పాపాల గుట్టు ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు. పుష్కరాల పనుల్లో సైతం అవినీతి చోటు చేసుకుందని ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు బహిరంగంగా చెప్పాల్సిన భాద్యత జిల్లా మంత్రులది, అధికారులకు ఉందని ప్రశ్నించారు. బిబిజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికిని ముఖ్యమంత్రి ఈ జిల్లాపై చిన్నచూపు చూపాడని ఆరోపించారు. ఎనిమిది డివిజన్లు చేసే అవకాశాలు ఉన్నప్పటికిని కేవలం ఆరు డివిజన్లతో సరిపెట్టి మమ అనిపించారని తమ రాజకీయ స్వార్థం కోసం టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే ప్రాంతాల్లోనే మండలాల ఏర్పాటు జరిగిందని ఒకటి రెండు మినహాయిస్తే మిగతా మొత్తం టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగినట్లుగా ఉందని ఆరోపించారు. జిల్లాను విచ్చిన్నం చేసిన ఘనుడు కెసి ఆర్ అని పాలమూరు చరిత్రను కనుమరుగు చేయడానికి కంకనం కట్టుకున్నాడని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలు చేయాలని, ఎనిమిది డివిజన్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు శాంతికుమార్, నాగురావు నామాజీ, పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవర్థన్‌రెడ్డి, కార్యాలయ కార్యదర్శి బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.