మహబూబ్‌నగర్

విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 31: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ధ్రోణి కారణంగా మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుండి జిల్లాలో 34 మండలాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కొల్లాపూర్‌లో 16సెం.మీల భారీ వర్షం కురియగా నాగర్‌కర్నూల్‌లో 11సెం.మీల భారీ వర్షం కురిసింది. ఇది ఇలా ఉండగా బుధవారం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. కొడంగల్‌లో 9.6సెం.మీల వర్షం కురియగా, బొంరాస్‌పేటలో 6.5 సెం.మీలు, కోస్గీలో 7.1సెం.మీ., దామరగిద్ద 5.6సెం.మీలు, బాలానగర్ 6సెం.మీలు, తలకొండపల్లి 8.2సెం.మీలు, కల్వకుర్తి 5.2సెం.మీలు, అడ్డాకుల 8.4సెం.మీలు, అలంపూర్, ధరూర్, ఇటిక్యాల, మాడ్గుల మండలాల్లో 4.2సెం.మీల వర్షపాతం నమోదు అయ్యింది. షాద్‌నగర్, కొందుర్గు, మద్దూర్, మిడ్జిల్, వంగూర్, దేవరకద్ర, మానవపాడు, కొత్తకోట, ఆత్మకూర్, ఉప్పునుంతల, తెల్కపల్లి , పెద్దమందడి, గట్టు మండలాల్లో 3సెం.మీల వర్షం కురిసింది. వడ్డెపల్లి, మల్దకల్, వెల్దండ, అచ్చంపేట మండలాల్లో 2సెం.మీల వర్షం కురిసింది. జిల్లాలో గత మూడు రోజుల నుండి అక్కడక్కడ చిరుజల్లులు పడుతూ మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురిసింది. దింతో కోయిల్‌సాగర్ వాగు మద్దూర్ మండలం కొమ్మూరు దగ్గర పొంగిపోర్లుతుంది. కొడంగల్ నియోజకవర్గంలోని పలు చెరువులు నిండి అలుగులు పారడంతో వాగులు, వంకలు నిండుకుండలా పారుతున్నాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సంబందించిన వాగులు, వంకలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి.
కొడంగల్‌లో 9 సెం.మీల వర్షం
కొడంగల్: గత నెల రోజులుగా వర్షం లేని కారణంగా రైతులు కుదేలయ్యారు. వేసిన పంటలు చేతికి వస్తాయో లేదో అని దిగాలుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు బారీ వర్షం కురిసింది. దింతో రైతులకు ఎంతో ఊరట లభించింది. వేసిన పంటలు చేతికి వస్తాయని ఆనందపడ్డారు. ఇదివరకు లేనివిధంగా 9 సెం.మీల వర్షం కురియడం గొప్పదిగా చెప్పవచ్చు. వర్షం రాకవల్ల కొడంగల్ మండలంలోని కుంటలు, చెరువులకు జలకళ వచ్చింది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో పాటు కాలువలు రావడంతో ఆయా పరిసర గ్రామాల ప్రజలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. కొడంగల్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న కొండారెడ్డి వెళ్లే రహదారిలో ఉన్న పాటుకాలువకు అధికంగా నీరు రావడంతో దాదాపు ఐదారు గంటలు ఎక్కడివారు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఉదయమే ఆ గ్రామస్థులు పలు పనుల నిమిత్తం పాలు, కూరగాయలు తీసుకుని కొడంగల్‌కు వస్తుంటారు. వర్షం రాకతో కొడంగల్, కొండారెడ్డిపల్లికి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అదేవిధంగా పర్కాపూర్ చెరువులోకి వర్షపు అధికంగా చేరడంతో చెరువు అలుగుపారింది. ఏది ఎమైన గత నెలరోజులుగా ఎదురుచూస్తున్న రైతుకు వర్షం ఎంతో ఊరటనిచ్చింది.
కరువుతీరా కురిసిన వర్షం
బొంరాస్‌పేట: నెలరోజులుగా ముఖం చాటేసిన వరణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించాడు. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన భారీ వర్షానికి మండలంలోని మెట్లకుంట, ఎల్లమ్మచెరువు, భూరాన్‌పూర్ పెద్ద చెరువుతో పాటు పలు కుంటలు నిండాయి. ఐదు గంటల పాటు కురిసిన వర్షానికి పొలాలన్ని చెరువులను తలపించాయి. ఇటీవలే వరినాట్లు వేసుకున్న వరి పొలాలు భారీ వర్షం దాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎరుపుమళ్ల కాకర్‌వాణీ ప్రాజెక్టులోకి భారీ వరదనీరు వచ్చి చేరుతుంది. గురువారంలోగా అలుగుపారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తూర్ బొంరాస్‌పేట పెద్ద చెరువులోకి భారీగా వరదనీరు పోటెత్తింది. ఎల్లమ్మవాడుక , భూరాన్‌పూర్‌వాగు, బరంతిపూర్ వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. కాగా బొంరాస్‌పేట చెరువులోకి వచ్చే ఎటికాలువకు గండిపడడంతో గ్రామస్థులు అంతా వెళ్లి గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. తహశీల్దార్ వెంకటయ్య ఎటికాలువ గండిపడ్డ చోటును పరిశీలించారు. 65 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు తహశీల్దార్ వెంకటయ్య తెలిపారు. మరో ఒకటి రెండు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగితే మండలంలోని మిగితా చెరువుల, కుంటలు కూడా నిండే అవకాశాలు ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత విస్తృతం
* నష్టాల్లో ఉన్నందున ఆస్తులు లీజుకు * బ్రాడ్‌బాండ్ సేవలు భేష్
* వినియోగదారులకు మరింత దగ్గర అవుతాం * టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో జిఎం పద్మనాభం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఆగస్టు 31: బిఎస్‌ఎన్‌ఎల్ సేవలను మరింత విస్తరింపజేసేందుకు కిృషిచేస్తున్నట్టు బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ పద్మనాభం తెలిపారు. బుధవారం జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సమావేశం మహబూబ్‌నగర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పద్మనాభం మాట్లాడుతూ ప్రతినెల జిల్లాలో రూ.2.61కోట్ల వసూళ్లు అవుతుందని అయితే జిల్లా వ్యాప్తంగా రూ.3.50కోట్ల ఖర్చు వెచ్చించడం జరుగుతుందని దాదాపు ప్రతినెల బిఎస్‌ఎన్‌ఎల్‌కు కోటి రుపాయల నష్టం వస్తుందన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన ఆస్తులను లీజుకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో 11 ఎక్‌సచెంజ్ కార్యాలయాలు, రూరల్‌లో 135 ఉన్నాయని పేర్కొన్నారు. బ్రాడ్‌బాండ్ సేవలు 6868 కనెక్షన్లతో అందిస్తున్నామని, 16694 డైరెక్టు ఎక్సెంజ్ లైన్స్ సేవలు ఇస్తున్నామన్నారు. 502 బిఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పని చేయడం జరుగుతుందన్నారు. ఒకపక్క ఉద్యోగులు, మరోపక్క వినియోగదారులు సంస్థకు రెండు కళ్లలాంటి వారని ఆయన పేర్కొన్నారు. బ్రాడ్‌బాండ్ సేవలు భేష్‌గా ఉన్నాయని కితాబు ఇచ్చారు. అయితే ఇటీవల గద్వాలలో సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్‌కు కారణంగా మేజర్ లైన్‌కు ఇబ్బంది ఏర్పడడంతో అక్కడ వినియోగదారులకు ఇబ్బందులు ఏర్పడ్డ మాట వాస్తవమేనని రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామన్నారు. కృష్ణా పుష్కరాల్లో కూడా వైఫై సేవలతో పాటు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్నారు.రాబోయే కాలంలో మండలాల్లో వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు సర్వీస్ చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మరిన్ని ల్యాండ్‌లైన్ పోన్ల కనెక్షన్లకు పలు ఆఫర్లు ఉన్నాయని రూ.49కే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆదివారం మొత్తంగా ఫ్రీకాల్ చేసుకోవచ్చని మిగితా రోజుల్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఫ్రీకాల్ ఉంటాయని తెలిపారు. అడ్వైజరీ కమిటీ సభ్యుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాలలో సేవలు అస్తవ్యస్థంగా ఉన్నాయని సరిచేయల్సిన అవసరం ఉందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వరంగ సంస్థ అనే భావన ఉండడంతో ఇంకా వినియోగదారుల సంఖ్య పెరుగుతూ పోతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు. నాగేంద్రగౌడ్ మాట్లాడుతూ సెల్ టవర్ల విషయంలో మరికొన్ని చర్యలు తీసుకోవాలని సిగ్నల్‌లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని సరిచేసుకోవల్సిన అవసరం ఉందని సూచించారు. సభ్యుడు క్రాంతికుమార్ మాట్లాడుతూ మార్కెటింగ్ విషయంలో ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని బిఎస్‌ఎన్‌ఎల్ టాప్ ఆఫ్, రిచార్జ్ కార్డులతో పాటు సిం కార్డుల అమ్మకాలను మరింత విస్తరింపజేస్తే భాగుంటుందని ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రచారం కూడా కల్పించాలని తెలిపారు. సభ్యుడు మనె్న బాబు మాట్లాడుతూ పేరపళ్ల గ్రామంలో టవర్ వేయాలని కోరారు. నారాయణపేటకు జెటిఓను నియమించాలని ముఖ్యంగా బిఎస్‌ఎన్‌ఎల్‌లో రిక్యూట్‌మెంట్ లేనికారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని రిక్యూట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణపేట ప్రాంతంలో 3జి సేవలను విస్తరింపజేయాలని కోరారు. సమావేశంలో డిఇ హేమలత, ఐఎఫ్‌ఏ నరసింహులు, డిజిఎం వేణుగోపాల్, డిజిఎం అబేద్‌అలీ, అధికారులు లాలప్ప, శ్రీనివాసులు, సిద్దప్ప, కిషోర్‌కుమార్, సత్యవాణి, రాములు తదితరులు పాల్గొన్నారు.

ములాఖత్‌పై కౌన్సిలర్లను
పరామర్శించిన ఎమ్మెల్యే అరుణ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఆగస్టు 31: గద్వాల జిల్లా కోసం కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా బస్సు దగ్థం కేసులో జిల్లా జైలులో ఉంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్లను బుధవారం ములాఖత్‌పై ఎమ్మెల్యే డికె అరుణ కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట గద్వాల చైర్ పర్సన్ పద్మావతీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ములాఖత్ ద్వారా కౌన్సిలర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను కూడా ఎమ్మెల్యే కలిసి పరామర్శించారు. తొమ్మిది మంది ఈ బస్సు దగ్థం కేసులో జైలులో ఉన్నారు. ములాఖత్ అనంతరం జిల్లా జైలు బయట ఎమ్మెల్యే డికె అరుణ విలేఖరులతో కలిసి మాట్లాడారు. గద్వాల జిల్లా కోసం పోరాటం చేస్తున్న వారిలో కొందరు బస్సు దగ్థమైన కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని వారిని పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. న్యాయపరంగా కేసును ఎదురుకుంటామని జిల్లా సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని తెలిపారు.

వర్షిణి కుటుంబానికి రక్షణ కల్పించి ఆదుకోవాలి
* నిందితులను కఠినంగా శిక్షించాలి * హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్
కొల్లాపూర్, ఆగస్టు 31: ఈనెల 24న ఆత్మహత్య చేసుకున్న వర్షిణి కుటుంబానికి రక్షణ కల్పిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని కుడికిళ్ల గ్రామంలో బుధవారం వర్షిణి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కడే వర్షిణిపై ఆఘాయిత్యం చేయలేడని, అతనివెంట మరికొందరు ఉండవచ్చని, నిజాలు తేల్చేందుకు పోలీసులు సంఘటన స్థలంలో కొన్ని ఆధారాలు(పగిలిన గాజులు, మద్యం సీసాలు) ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఫోన్‌కాల్ డేటాను కూడా పరిశీలించాలన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజలు ముందు బహిరంగంగా జరగవు కాబట్టి వివిధ కోణాలలో పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇద్దరు ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలతోనైనా ప్రభుత్వం పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవచారి మాట్లాడుతూ ప్రభుత్వం మద్యంను ప్రధాన రాబడిగా గుర్తించడం జరిగిందని, మద్యం, సినిమాలు చూస్తూ యువత దురాలవాట్లకు గురవుతున్నారని, దీనికి ప్రభుత్వంతోపాటు సమాజం కూడా బాధ్యత వహించాలన్నారు. ఎంజికెఎల్‌ఐ పథకాన్ని చంద్రకుమార్ బృందం పరిశీలించారు.

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
* రతంగ్‌పాండు రెడ్డి
ధన్వాడ, ఆగస్టు 31: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రప్రభుత్వామే నిర్వహించాని బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ధన్వాడ, మరికల్ పట్టణాల్లో తిరంగాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ధన్వాడలో జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి హాజరుకాగా, మరికల్‌లో జరిగిన యాత్రకు నారాయణపేట నియోజకవర్గం బిజెపి ఇంచార్జి నర్సన్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జరుపుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరంగయాత్రను ప్రారంభించారని అందులో భాగంగా జిల్లాలో కూడా యాత్ర కొనసాగుతుందన్నారు. పాలమూరు జిల్లా లోని ప్రతి గ్రామంలో తిరంగాయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్రద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పకుండ ప్రతి గ్రామంలో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా నేతలు గోవర్థన్‌గౌడ్, రాంచంద్రయ్య, కుర్వమల్లయ్య, పోలప్ప, చంద్రశేఖర్, ఉమేష్‌కుమార్, నర్సిములు, ఉదయభాను, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

జూరాలకు 18వేల క్యూసెక్కుల వరద
ధరూరు, ఆగస్టు 31: గత రెండు రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు తోడుకావడంతో జూరాలకు స్వల్పంగా వరద చేరింది. బుధవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.410 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 18వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, సమాంతర కాలువ, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులకు 29,030 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఆల్మట్టి జలాశయంలో 519.600 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువకు 15వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణ్‌పూర్ జలాశయంలో 492.010 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 14,589 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 6 వేల క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

జిల్లాల విభజన నేపథ్యంలో...
ఫైళ్లు, స్థిర చరాస్థులు, ఉద్యోగుల పంపిణీపై దృష్టి పెట్టాలి
* కలెక్టర్ టికె శ్రీదేవి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఆగస్టు 31: జిల్లాల విభజన నేపథ్యంలో ఫైళ్లు, స్థిర చరాస్థులు, ఉద్యోగుల పంపిణీ వంటి అంశాలు ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా చేయాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులకు సూచించారు. బుధవారం రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో జిల్లాలో విభజన దృష్ట్యా ఫైళ్లు, ఇతర సామాగ్రీ పంపిణీ వంటి అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఫైళ్లకు సంబందించి ఇండెక్స్ తయారు చేయాలని, అవసరమైన ఫైళ్లను స్కానింగ్ చేయాలని, ఉద్యోగుల సర్వీస్ రికార్డులను ఇప్పటి వరకు నమోదు చేయాల్సిన అన్ని అంశాలను నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినట్లుగానే జిల్లా స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి విభజనకు సంబందించిన అంశాలను అప్పగించడం జరుగుతుందని ఇందులో ప్రతి శాఖ కూడా భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందని అన్నారు.
కొత్త డివిజన్ల ఏర్పాటు, మండలాల ఏర్పాటు సందర్భంగా విభజన కూడా మారాల్సి వస్తుందని అలాగే అయా శాఖల వారిగా మంజూరు అయినా ఫోస్టులు, పని చేస్తున్న సిబ్బంది వివరాల వంటి అంశాలను పక్కాగా తయారు చేసుకోవాలని సూచించారు. దసరా నుండే కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమైతే, పని ప్రారంభించేలా కార్యాలయాలు గుర్తింపు వంటివి వుండాలని తెలిపారు. ఈ సమావేశంలో జెసి రాంకిషన్, ఎజెసి బాలాజిరంజిత్ ప్రసాద్, డిఆర్‌ఓ భాస్కర్, డిఆర్‌డిఎ పిడి మధుసుధన్‌నాయక్, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జోరందుకున్న భూముల అమ్మకాలు
* భూములకు పెరిగిన డిమాండ్ * కోట్లలో భూదందాలు
* అసైన్డ్ భూములకు సైతం రెక్కలు * కలెక్టరేట్ ఎక్కడంటూ చర్చలు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 31: దసరా పండుగ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచే పరిపాలన కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో ఈ ప్రాంతంలో భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 జిల్లాలో నాగర్‌కర్నూల్ కూడా ఉండటంతో రియల్ ఎస్టెట్ వ్యాపారుల దృష్టంతా నాగర్‌కర్నూల్‌పైనే పడింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా అవుతుందనే ప్రచారం జరగడంతో గతంలో అతి తక్కువ ధరకు పలికిన భూములు సైతం లక్షల్లో అమ్ముడుపోయాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై గత మూడు నెలల క్రితం స్పష్టమైన ప్రకటన చేయడంతో ఒక్కసారిగా లక్షల్లో పలికిన భూములకు కోట్లలో కొనుగోళ్లు చేయడంతో ఈ ప్రాంతంలో భూముల రేట్లు ఏవిధంగా పెరిగాయో ఊహించుకోవచ్చు. ఒక ఎకరాకు పైగా ఉన్న భూమిని ఐదుకోట్లకు కొనుగోళ్లు చేయడం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న గ్రామాలలో వ్యవసాయ పొలాలను కొనుగోళ్లు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు.
వ్యవసాయ పొలాలను ప్లాట్లుగా మార్చేందుకు నిబంధనలు కఠినంగా ఉన్నాయని రెవిన్యూ అధికారులు అంటున్నప్పటికి, ఆచరణలో దీనికి భిన్నంగా నడుస్తున్నది. నాలా అనుమతులు వచ్చాయంటూ రాత్రికి రాత్రే వ్యవసాయ పొలాలలో ప్లాట్లుగా విభజిస్తూ రాళ్లు కనిపిస్తున్నాయి. ఇలా ప్లాట్లుగా మారిన వాటిలో అసైన్డ్ భూములు సైతం ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఓ రైతుకు భూమిని అసైన్డ్ చేస్తే అట్టి భూములను క్రయవిక్రయాజలు చేయరాదని, ఒకవేళ చేసిన అవి చెల్లవని ప్రభుత్వ చట్టాలు తెలుపుతున్నాయి. కాని, వీటి గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రియల్ ఎస్టెట్ వ్యాపారులు చెప్పిందే వేదంగా మారుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ ప్రాంతంలో గతేడాది నుంచి జరుగుతున్న భూముల క్రయవిక్రయాలకు సంబందించిన రికార్డులన్నీంటిని స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఇటీవల కొంతమంది రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. ఇది ఇలా ఉండగా కొత్తగా ఏర్పడే నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎక్కడ నిర్మాణ మవుతుందోననే చర్చకూడా జోరుగా సాగుతున్నది. కలెక్టరేట్ కొల్లాపూర్ చౌరస్తా ప్రాంతంలోనే జరుగుతుందనే ప్రచారంతో ఈ ప్రాంతంలో భూముల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కాని ఇంత వరకు అధికారులు ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించలేదని, ప్రభుత్వ భూముల కోసం అనే్వషిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. మొత్తంమీద కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడో అధికారులకు తెలియని పరిస్థితులలో ఇక్కడేనంటూ భూ వ్యాపారులు ప్రచారం చేసుకుంటు ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు.

రెవెన్యూ డివిజన్ సాధనకు ఆమరణ దీక్ష
కల్వకుర్తి, ఆగస్టు 31: కల్వకుర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం అఖిలపక్షం కమిటీ నిర్ణయం మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిలపక్ష నాయకుడు అచారి సెప్టెంబర్ 7వ తేదీన అమరణ నిరహార దీక్ష ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్ యాదవ్‌ల చేతుల మీదుగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిచడం జరుగుతుందని అఖిలపక్ష నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి,నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలం,వైస్ చైర్మన్ షాహెద్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టిడిపి తాలుకా అధ్యక్షుడు బాలస్వామిగౌడ్ లు మాట్లాడుతు కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయడానికి అన్ని వౌళిక వసతులు,సౌకర్యాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుర్తి ప్రజల మనోభావాలను గుర్తించి తుది నోటిపికేషన్‌లో కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని,కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల, చారకొండ, ఇర్విన్‌లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఇతర జిల్లాలలో కలుపవద్దని వారు కోరారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు కడియం శ్రీహరి,మహమూద్ అలీలతో పాటు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడిని త్వరలోనే కలిసి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ప్రకటించే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో చేపడుతున్న అమరణ నిరాహార దీక్షకు కల్వకుర్తి నియోజకవర్గంలోని సిపిఐ, కుల, వర్తక, వ్యాపార, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అఖిలపక్షం నాయకులు సత్యం, దుర్గప్రసాద్, కండె హరిప్రసాద్, అభిలాష్‌రెడ్డి, షాకీర్, శేఖర్‌రెడ్డి, రాంరెడ్డి, రాహుల్, ఖలీల్, కృష్ణాగౌడ్, వెంకటేష్ ఉన్నారు.