మహబూబ్‌నగర్

కదంతొక్కిన కార్మిక లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపిస్తూ కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 10 కార్మిక సంఘాలు పిలుపునివ్వడం దాంతో శుక్రవారం జిల్లాలో కార్మికలోకం కదంతొక్కి సమ్మెను సూపర్ సక్సెస్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది డిపోలలో ఆర్టీసి బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసి కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనడం, కార్మిక సంఘాల నేతలు ఆర్టీసి బస్సుడిపోల ఎదుట ధర్నాకు దిగడంతో శుక్రవారం తెల్లవారుజామునుండే బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దింతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో సమ్మె ప్రభావంతో దుకానాలు మూతపడ్డాయి. గ్రామపంచాయతీ కార్మికులు సైతం సార్వత్రిక సమ్మెలో పాల్గొనడంతో గ్రామాల్లో కార్మికుల సేవలు నిలిచిపోయాయి. సమ్మెలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు మరికొన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు జిల్లాలోని పలు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. టిఎన్‌జిఓ సైతం సమ్మెకు మద్దతు పలకడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సమ్మె ప్రభావం కనిపించింది. ఇది ఇలా ఉండగా బ్యాంకు సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకులు మూతపడ్డాయి. లావాదేవిలకు నడవలేదు. పలు ఇన్సురెన్స్ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్డిఎ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికోట్టెందుకే కార్మికులు సమ్మెకు వెళ్లారని జిల్లాలో సమ్మె విజయవంతం అయ్యిందన్నారు. సి ఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో సిఐటియు నాయకులు కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక శక్తిని సంపదను విదేశాలకు ధారపోస్తూ ప్రధానమంత్రి పెట్టుబడిదారులకు ఒత్తాసు పలుకుతున్నారని, కంపెనీలకు రాయితీలు ఇస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో పట్టణంలోని పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. వందలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు వెంకటేష్, అంబాదాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేకవిధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతంతోనైన కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశిల పోరాటలు చేస్తేనే ఫలితం లభిస్తుందని లేకుంటే కార్మిక చట్టాలను ప్రధానమంత్రి తుంగలో తొక్కుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు విజయ్‌కుమార్, చంద్రకుమార్, నరసింహులు, శ్రీను, వెంకటరాములు, బాలస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.