ఆంధ్రప్రదేశ్‌

ఎపి ఎంసెట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాలూ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఎపి ఎంసెట్ శుక్రవారం ఉదయం యథావిధిగా ప్రారంభమైంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉదయం 10 గంటలకు ఎంట్రన్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం మెడిసిన్ ఎంట్రన్స్ జరుగుతుంది. ఎంసెట్ నిర్వహణకు ఏపి ప్రభుత్వం మొత్తం 546 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రాంతంలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటయ్యాయి. ఇంజనీరింగ్‌లో 1.89 లక్షల మంది, మెడిసిన్‌కు 1.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో జామర్లను, గోడగడియారాలను ఏర్పాటు చేశారు.