మెదక్

సిద్దిపేటలో వీలైనంత త్వరగా వైద్య కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 25: సిద్దిపేట జిల్లాలో సాధ్యమైనంత త్వరగా మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డా.రమణి అన్నారు. మంగళవారం మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా టిఎస్‌ంఎస్‌ఐడిసి చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, డిప్యూటి ఇఇ విష్ణుప్రసాద్, శారద, హితేష్, ప్రేరణ, సత్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ రామకృష్ణతో కలిసి సిద్దిపేట ఎంసిహెచ్, ఏరియా ఆస్పత్రులను పరిశీలించారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ఎంసిఐ నిబంధనల ప్రకారం 300బెడ్ల ఆస్పత్రి, కళాశాల సమీపంలో ఉండాలని, సిద్దిపేటలో ప్రస్తుతం 100బెడ్ల దవాఖాన ఉందని, దీన్ని 300బెడ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నామన్నారు. వీటి పై 2రోజుల్లో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మంత్రి హరీష్‌రావు, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేటలో పర్యటించామన్నారు. మెడికల్ కాలేజ్ కోసం సుమారు 25-50ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. మెడికల్ కాలేజ్‌కు జూలైలో ఎంసిఐకి దరఖాస్తు చేయాలన్నారు. అక్టోబర్‌లో కళాశాల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంసిఐ బృందం సిద్దిపేటలో అన్ని సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటు చేస్తారన్నారు. 300బెడ్ల ఆస్పత్రికి అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 19తర్వాత కళాశాలలో 150మంది విద్యార్థులకు అడ్మీషన్లు ప్రారంభమైతాయన్నారు. మెడికల్ కాలేజ్‌లో అటాలజీ, పిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ల్యాబ్, ఆడిటోరియం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సిబ్బంది నిర్వహణ కోసం క్వార్టర్స్ నిర్మించాలని, 200మంది డాక్టర్లు అవసరమైతారన్నారు. 5ఏండ్లలో 700కోట్లతో కళాశాల పూర్తిస్థాయిలో నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి యేటా 70కోట్లదాకా డాక్టర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిద్దిపేట కళాశాలను దేశస్థాయిలో గుర్తింపు వచ్చేలా అధికారుల బృందం పనిచేస్తుందన్నారు. పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటుకై స్థలాన్ని మహబూబ్‌నగర్‌లో ఇటీవల ఏర్పాటు చేశారని, అందులో 150మంది విద్యార్థులకు ఉచిత వైద్యవిద్య అందించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట ఏరియా హాస్పిటల్‌కు కోమటిచెరువు పక్కనే ఉండడం అదనపు ఆకర్షణగా మారిందన్నారు.
ట్రామా కేర్‌సెంటర్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు
సిద్దిపేటలో మంత్రి ఆదేశానుసారం ట్రామా కేర్‌సెంటర్ ఏర్పాటు కై అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా గుర్తించామన్నారు. 9కోట్లతో లెవెల్ 2ట్రామా కేర్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డుప్రమాదంకు గురైన వారికి, ఫ్రాక్చరైన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో పాటు అత్యాధునిక బ్లడ్‌బ్యాంక్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభిస్తామన్నారు. 60మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజ్‌లో పీజి కాలేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి నిశ్చయంతో ఉన్నారని, తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏరియా హాస్పిటల్‌ను బోధన హాస్పిటల్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 300బెడ్ల హాస్పిటల్‌గా స్థాయిని పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేశామని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. మెడికల్ కాలేజ్ కోఆర్డీనేటర్‌గా డా.శారద వ్యవహరిస్తారన్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్‌లోని ఐసియు, బ్లడ్‌బ్యాంక్, సిబ్బంది క్వార్టర్లను సందర్శించారు. ఐసియులో రోగులతో మాట్లాడారు. సిద్దిపేటలో వైద్యసేవలు అందిస్తున్నారని, పరిశుభ్రంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఆమె వెంట ఓఎస్డీ బాల్‌రాజ్, సూపరింటెండెంట్ శివరాం, ఎస్పీహెచ్‌ఓలు కాశీనాథ్, శివానందం తదితరులు పాల్గొన్నారు.