మెదక్

ఆయుష్ వైద్య సేవలు బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 25 : ఆయూష్ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండేలా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతి జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవన్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అల్లోపతి వైద్యానికి ధీటుగా ఆయుష్ వైద్యాన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైద్య రంగలో సమూల మార్పులు తీసుకోచ్చేందుకు సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన
ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా కావాల్సిన చర్యలు తీసుకొని ఆయుర్వేద ఆయూష్ వైద్యంపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఇండియన్ మెడిసన్ అండ్ హోమియోపతిపై ఆయుష్ పై ప్రజలకు అవగాహన మరింత కల్పించాల్సిన అవసరం ముందన్నారు. దేశ వైద్య చరిత్రలో హోమియోపతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. కాగా అల్లోపతి వైద్యం అందుబాటులో వచ్చాక ప్రజలకు హోమియోపతిపై ఆసక్తి తగ్గిందన్నారు. ఈవిషయంపై ప్రజలకు ఎక్కువ నమ్మకం కలిగేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి ఆయుర్వేదంపై సందేశం వెళ్లేలా తక్షణ పరిష్కార దోరణి వెళ్లెలా ప్రజలను చైతన్యం చేసేలా ఆయూష్ విభాగం ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈసందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌తో కలసి హోమియపతి, ఆయుర్వేద మందులను పేద ప్రజలకు అందచేశారు. ఈకార్యక్రమంలో ఆయుర్వేద అదనపు సంచాలకులు గురుమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ, దీపాంజలి, అరుణ, ఉమ తదితరులు పాల్గొన్నారు.