మెదక్

పంటనష్ట పరిహారం సత్వరమే అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాల్‌కల్, అక్టోబర్ 25: అతివృష్టితో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం జహీరాబాద్ ప్రాంతంలోని రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. న్యాల్‌కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో ఖరీఫ్ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. పంటనష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో బోరు బావులకు అంతగా అనుకూలం లేనందున ప్రత్యామ్నయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతంలో తాగు, సాగుకు ప్రభుత్వం తగిన చర్యలము తీసుకుని రైతులను ఆదుకోవాలన్నారు. ఈ పర్యటనలో జెఎసి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేశం, రాష్ట్ర నాయకులు బీరయ్యయాదవ్, మొగుడంపల్లి ఆశప్ప, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంజీర నీరు జిల్లాకే దక్కాలి
రాయికోడ్: సింగూర్ ప్రాజెక్టుకు సంబంధించిన మంజీర నీరు సంగారెడ్డి జిల్లా ప్రజలకే దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జెఎసి కన్వీనర్, ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. మండలంలోని సింగితం గ్రామంలో ఇటివల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకు అధికారులు పెద్దమొత్తం పంట ఇన్స్‌రెన్స్ కట్ చేస్తున్నారని దీంతో ఒక్క రైతుకు నష్టపరిహారం అందలేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతి గ్రామంలో రైతు జెఎసిలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు అశోక్‌కుమార్, బీరయ్యయాదవ్, మంజీర జిల్లా రైతు సమాఖ్య అధ్యక్షులు పృధ్విరాజ్, ఎంపిటిసి శశికాంత్‌పాటిల్, నాయకులు మల్లికార్జున్‌పాటిల్, అంబన్న, బాలయ్య, రైతులు పాల్గొన్నారు.