మెదక్

త్వరలో ఏడుపాయలకు రానున్న సిఎం కెసిఆర్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దిచెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత వనదుర్గామాత ఆలయానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో రానున్నారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా ఏడుపాయలకు విచ్చేసిన శేరి సుభాష్‌రెడ్డికి ఆలయ ఈఓ టి.వెంకటకిషణ్‌రావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దుర్గామాతను టియస్ ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి దర్శించుకొని అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు ఆలయ మర్యాదలతో టియస్ ఎండిసి చైర్మన్‌కు శాలువ, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో టియస్ యండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఏడుపాయల్లో అన్ని హంగులతో దుర్గామాత ఆలయాన్ని తీర్చిదిద్దడానికి వ్యూహాత్మకమైన ప్రణాళిక రూపొందిందని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అతి త్వరలో ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకోడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఏడుపాయలకు రానున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారీ వరదలు, వర్షాలతో ఏడుపాయల ఆలయం దెబ్బతిందని, ప్రభుత్వం పూర్తి మరమత్తులు చేసేందుకు రూ.1.05 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు. మహాశివరాత్రి జాతరకు పనులన్ని పూర్తి అవుతాయని ఆయన వివరించారు. వనదుర్గామాతను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏడుపాయలను అత్యాధునికంగా అన్ని హంగులతో పర్యాటకులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు వౌళిక వసతుల కల్పన కోసం డార్మెట్రీలు, కాటేజిలు, వసతి గృహాలు నిర్మిస్తామని ఆయన వివరించారు. చైర్మన్ వెంట ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు తదితరులు ఉన్నారు.