మెదక్

రాంపూర్‌లో అతిసార విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, నవంబర్ 21: అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో 13 మందికి అతిసార వ్యాధి సోకి అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. కొందరు సంగారెడ్డి, మరికొందరు హైదరాబాద్, పెద్దశంకరంపేట, మరొకరు అల్లాదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలివెళ్లారు. రాంపూర్ గ్రామానికి చెందిన తిప్పల కిష్టయ్యకు అతిసార వ్యాధి సోకడంతో అల్లాదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా అదే గ్రామానికి మాధవి(24), కొండల్‌రెడ్డి(25), లక్ష్మణ్(35), బాపయ్య(40), దత్తు(24), దుర్గమ్మ(40), సోని(16), రమేశ్(23)లు అతిసార వ్యాధితో ఆదివారం నుండి వాంతులు, విరోచనలతో బాధపడటంతో వీరిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి, హైదరాబాద్, పెద్దశంకరంపేట ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కాగా గ్రామంలోని చెరువు కట్ట సమీపంలోని చేదబావిలో నీరు త్రాగడం వల్లే అతిసార వ్యాధి సోకినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ బావిలో కొత్త నీరు రావడం వల్ల వీటిని తాగిన కొన్ని కుటుంభాలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో వీరిని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్సలు చేస్తుయిస్తున్నారు. విషయం తెలిసిన అల్లాదుర్గం వైద్య సిబ్బంది రాంపూర్ గ్రామంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు చికిత్సలు అందిస్తున్నారు. ఆ బావిలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని వైద్య సిబ్బంది తెలిపారు.