మెదక్

మిషన్ కాకతీయ సత్ఫలిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 22: తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన మిషన్ కాకతీయ రెండు విడతలుగా చేపట్టిన పనుల ఫలితాలు అందుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రెండు పంటలకు సాగునీరందించేలా చెర్వులు నిండాయన్నారు. 46 వేల చెర్వుల్లో 30 వేల చెర్వులు మత్తడి బొర్లాయని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపూర్‌లో 43.50 లక్షలతో ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో నిర్మించే సిసి రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోకలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 3 వేల కోట్లతో చెర్వుల మరమ్మతులు చేపట్టామన్నారు. ప్రతి కుంట, చెర్వు బాగైందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ 9 గంటలపాటు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ-3లో గొలుసుకట్టు కాల్వలు బాగుచేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటి వనరులు బాగుచేసివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ నియోజకవర్గంలో కూడా 3వ విడత చెర్వులకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసి వచ్చే ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో కోటి 50 లక్షల చేపవిత్తనం చెర్వుల్లో వేశారన్నారు. కోంటూరు చెర్వు కోసం మీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అనేకసార్లు చెబుతుంటారన్నారు. మరమ్మత్తుత్తులు, ఆధునీకరణకోసం కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. పించన్లు, విద్యుత్, రహదారులు అన్ని సమకూర్చుతున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కోంటూరు ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటికే సర్వే పూర్తయిందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా నింపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భారతి హొళ్లికేరి, ఎంపిపి లక్ష్మీ, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, సర్పంచ్ ఫయాజ్‌అలీ, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లు, డిఇ జగదీశ్వర్, ఇరిగేషన్ ఇఇ ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి హరీష్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డిలు పూలమాలలువేశారు. గ్రామంలో ర్యాలీలో నిర్వహించారు.