మెదక్

‘డబుల్’ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ గజ్వేల్/ జగదేవ్‌పూర్ ; రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో శుక్రవారం పండుగ శోభ సంతరించుకుంది. రెండు గ్రామాల్లో ప్రతి ఇంటిలో నూతనంగా నిర్మించిన ఇళ్లను శుద్ధి చేసుకొని, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు, బంతీ, చామంతీ పూలతో ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. సిఎం కెసిఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం నిర్మాణాల సాముహిక గృహా ప్రవేశాలకు వేద మంత్రోచ్ఛరణలు, ణల సాంప్రదాయబద్ధంగా కన్నులపండువగా ప్రారంభించారు. ఎన్నికల ముందు ప్రజలకు ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని హామీ మేరకు గత ఏడాది విజయదశమి రోజున 600 ఇండ్లకు శ్రీకారం చుట్టారు. 14 నెలల తర్వాత అన్ని హంగులతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను శుక్రవారం సిఎం కెసిఇర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జెసి హన్మంత్‌రావులో ప్రారంభోత్సవం చేశారు. ఆనంతరం కల్యాణ మండపంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 7-53గంటలకు సిఎం కెసిఆర్ ముందుగా నర్సన్నపేట గ్రామంలో పైలాన్ ప్రారంభించారు. ఆనంతరం నర్సన్నపేటలోని భూకల జయశ్రీ పర్వతాలు యాదవ్ ఇంట్లోకి వెళ్లి నూతన గృహాన్ని పరిశీలించారు. కొత్త ఇళ్లు ఏలా ఉన్నాయని సిఎం కెసిఆర్ ప్రశ్నించగా లబ్దిదారులు చాల బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్తులను కెసిఆర్ దీవించి.... అక్కడ నుండి ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో నూతనంగా అన్ని హాంగులతో నిర్మించిన కళ్యాణ మండపం ముందు నిర్మించిన డబుల్ బెడ్ రూం ఫైలాన్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆవిష్కరించారు. ఆనంతరం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. కళ్యాణ మండపంలో సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో హోమ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆనంతరం నిర్వహించిన సభలోకెసిఆర్ ప్రసంగించి, నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాలను నగదు రహిత గ్రామలుగా ప్రకటించారు. నగదు రహితంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌గా నిలువాలన్నారు. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా రెండు గ్రామాల వ్యాపారులకు స్వైప్ మిషన్లు సిఎం కెసిఆర్ పంపిణీ చేశారు. ఎర్రవల్లి , నర్సన్నపేట గ్రామాలు స్వయం పాలన, స్వయం సమృద్ధి, స్వయం శాసిత, స్వయం సహాయక గ్రామాలుగా ఎవరితో ఆధారపడకుండ ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎర్రవల్లి , నర్సన్నపేట గ్రామాలు అద్బుత, ఆదర్శ గ్రామలుగా కొత్త చరిత్రను సృష్టించాలని ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ ఉదయం 7-30 నుండి 8-30 వరకు గంట లోగా డబుల్‌బెడ్ రూం ప్రారంభోత్సవంలో పాల్గొని హైదరాబాద్ తిరుగుపయణమయ్యారు. వెళ్తున్న క్రమంలో కాన్వయ్ ద్వారా ఎర్రవల్లి గ్రామాల ప్రధాన వీధుల్లో పర్యటించి గ్రామస్తులను అప్యాయంగా పలకరించారు. సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ రేంజ్ డిఐజీ అకుల్ సబర్వాల్, పోలీస్ కమిషనర్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సిఎం కెసిఆర్ పర్యటన విజయవంతంగా ముగియటంతో గత కొన్ని రోజులుగా అహార్నిశలు శ్రమించిన అధికార యంత్రాంగం ఊపిరీ పీల్చుకున్నారు.