మెదక్

త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్త్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 25: గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యారంగంలో ఆశించిన ఫలితాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఆదివారం రోజు మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. వరంగల్‌లో త్వరలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఐఐయం మంజూరికై కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 391 కెజిబివి పాఠశాలల్లో 75 వేల మంది విద్యార్థినిలు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో వెనుకబడిన మండలల్లో విద్యార్థినిలకు కెజిబివి పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8వ తరగతి వరకు కేంద్రం కెజివిబి విద్యార్థుల ఖర్చులను భరిస్తుందని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 6 నుండి 10వ తరగతి వరకు కెజిబివి విద్యార్థుల ఖర్చులను భరిస్తుందని తెలిపారు. ప్లస్-2గా కెజిబివిలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వంను కోరినట్లు ఆయన తెలిపారు. జవహార్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రీయ మాధ్యమిక నిధులు 60:40 భరిస్తుండగా దానిని కేంద్ర ప్రభుత్వం 75:25 శాతం కొరకై పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా మైనార్టీ గురుకుల విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి 210 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు. మెదక్‌లో పిజి కేంద్రం మంజూరు చేయాలని ఉపసభాపతి కోరిక మేరకు ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో విద్యాప్రమాణాలను అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, ఎస్పీ చందనాదీప్తి, డిఆర్‌ఓ మెంచు నగేష్, డిఎస్పీ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జీవన్‌రావు, గంగాధర్, అరునార్తి వెంకటరమణ, మాయ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ శాంతిని కోరిన ఏసు అందరికీ ఆదర్శం

సిద్దిపేట, డిసెంబర్ 25 : మనమంత ఒక్కటేనని..ప్రపంచ శాంతి కోరి సర్వ మానవ సంక్షేమమే ధ్యేయంగా పాటుపడిన ఏసుక్రిస్తు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిఎస్‌ఐ చర్చిలో ఆదివారం జరిగిన క్రిస్మస్ ప్రార్థన వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొని కేక్ కట్ చేశారు. ఆనంతరం పాస్టర్ల ఆశీస్సులు తీసుకొని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఏ మతగ్రంథమై శాంతిని ప్రభోధిస్తుందన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సారంశం ఒక్కటేనని..ప్రపంచ శాంతిని కోరుకుంటాయన్నారు. క్రైస్తవుల అభ్యున్నతికీ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆన్ని మతాల పండుగలను సమానంగా ఆదరిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి కాంక్షించి తెలంగాణ సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.130 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అంతా కలసి,మెలసి క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నాడన్నారు. సవ సమాజ నిర్మాణం కోసం క్రైస్తవుల అభ్యున్నతికి పాటుపడేలా అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ న్యాయం కల్పిస్తుందన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అన్నివర్గాల అభ్యున్నతితో తెలంగాణను కోటిరతనాల వీణగా, కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతానన్నారు. క్రైస్తవుల్లోని పేద పిల్లల వివాహాలు జరుపుకునేలా త్వరలో సిద్దిపేట అన్ని హంగులతో క్రిస్టియన్ భవన్ ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. అలాగే మరో మూడు చోట్ల చర్చిల నిర్మాణానికి నిధులు సమకూరుస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం పండుగకు ముందు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. క్రిస్మస్ పండుగను సంబురంగా జరుపుకునేలా క్రిస్మస్ వింధు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించిందన్నారు. సిద్దిపేట చర్చి భవనాన్ని అన్ని హంగులతో నిర్మించినట్లు తెలిపారు. తాను ఎప్పుడు నామినేషన్ వేసినా ఏసుప్రభువు ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ దాఖలు చేస్తానని, గత 14 సంవత్సరాలుగా పరంపరగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సిఎం కెసిఆర్‌కు మంచి ఆరోగ్యం కల్గించేలా ఏసుప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు రాధకిషన్‌శర్మ, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, పాల సాయిరాం, రవీందర్‌రెడ్డి, ఫాస్టర్ అశోక్, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.