మెదక్

సాదాబైనామా కేసులకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 16: సాదా బైనామా కేసులను త్వరిత గతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తహసీల్ధార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వివిధ మండలాల తహసీల్ధార్లతో సమీక్షించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై పెండింగ్ ఫైళ్లు ఉంటే సత్వరమే పూర్తి చేయాలన్నారు. 0-5వయస్సులోపు చిన్నారులను గుర్తించి అంగన్‌వాడి కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరేలా మహిళల్లో అవగాహాన పెంచాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డిఆర్వో రఘరాంశర్మ, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

బాబోయ్ పులి
పర్శరాంనగర్ ప్రాంతంలో
చిరుత సంచారం
హడలెత్తిపోతున్న జనం

దుబ్బాక, జనవరి 16: మండలంలోని పర్శరాంనగర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందన్న భయంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పర్వరాంనగర్ పూర్తిగా మల్లన్నగుట్ట అటవీప్రాంతంలో ఉండడంతో చుట్టు దట్టమైన అడవి విస్తరించి ఉంది. భౌగోళికంగా సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో అటవీప్రాంతం విస్తరించి ఉండడంతో చిరుతపులి సంచారం తరచుగా కొనసాగుతుంది. ఆదివారం పర్శరాంనగర్‌కు చెందిన వెంకటయ్యకు చెందిన 4మేలకు చిరుత దాడి చేసి చంపివేయడంతో సమాచారాన్ని అటవీశాఖాధికారులకు తెలిపారు. అటవీ అధికారులు వచ్చి చనిపోయిన మేకలను పరిశీలించి చిరుత దాడి చేసి చంపిందని నిర్దారించారు. చాలా ఏళ్ల తర్వాత చిరుత సంచరిస్తుందని తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత దాడి చేసి మేకలను చంపిందని తెలియడంతో సమీపంలోని కమ్మర్‌పల్లి, మల్లాయిపల్లి, చెల్లాపూర్, రాజక్కపేట, సరిహద్దు మండలాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారం వార్తతో ప్రజలు వ్యవసాయ పొలాల వద్దకు పోయేందుకు కూడా జంకుతుందన్నారు. తమ పశువులను కూడా పొలాల వద్ద ఉంచకుండా ఇళ్ల్లకు తెచ్చుకుంటున్నారు. పర్శరాంనగర్‌లో చిరుత దాడి చేసి మేలకు చంపిందన్న వార్త తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుతను పట్టుకొని ప్రాణాపాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.