మెదక్

జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 5: భారతదేశ అభివృద్ధికి బాబు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. బాబుజగ్జీవన్‌రామ్ జయంతి పురస్కరించుకొని ఎంపిడిఓ చౌరస్తాలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ అట్టడుగు అభివృద్ధిలో కృషిచేశాడన్నారు. దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ, రైల్వేశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పదవికే వనె్న తెచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో పలుమార్పులు తెచ్చినట్లు తెలిపారు. సిడబ్లుసి గోదాంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాబు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలను కొనియాడారు.
కలెక్టర్ నివాళి
జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఆర్డీఓ ముత్యంరెడ్డిలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం ఆర్డీఓ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.