మెదక్

గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 3: గజ్వేల్ పట్టణంలో చేపడుతున్న వివిద అభివృద్ది పనులను పరిశీలించేందుకు సిఎం కెసిఆర్ శుక్రవారం చేపట్టిన పర్యటన ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్, గఢా అధికారి, జెసి హన్మంతరావుల నేతృత్వంలో పనులు పురోగతిలో ఉండగా, సిఎం కెసిఆర్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడంతో యంత్రాంగం గజ్వేల్ పర్యటనను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ శివకుమార్, ఏసిపి గిరిదర్‌ల ప్రత్యేక పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు కాగా, విలేఖరులతో పాటు ప్రజలనెవరినీ దగ్గరకు రానివ్వలేదు. అయితే ఎంపిక చేసిన పార్టీ ప్రముఖులను మాత్రమే సిఎం కెసిఆర్ దగ్గరకు వెల్లడానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా పట్టణంలో మార్కెట్ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మాత్రమే వాహనం నుండి దిగిన సిఎం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టిఆర్‌ఎస్ ఇంచార్జి బూంరెడ్డి తదితర ముఖ్యులతోనే కెసిఆర్ ముచ్చటించారు. అయితే పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ది పనులలో నిర్లక్ష్యం వద్దని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తద్వారానే గజ్వేల్ రోల్ మోడల్‌గా దేశంలో ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలోనే సిఎం కెసిఆర్ కూర్చొని ముందుకు సాగగా, 100 పడకల ఆసుపత్రి, ఆడిటోరియం, సిఎం క్యాంపు ఆఫీస్, ఎడ్యుకేషన్ హబ్, డబల్‌బెడ్‌రూం ఇండ్ల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్‌లు టేకులపల్లి రాంరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ అరుణ బూపాల్‌రెడ్డి, ఎంపిపి చిన్నమల్లయ్య, జెడ్‌పిటిసి వెంకటేశ్‌గౌడ్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, నేతలు ఎలక్షన్‌రెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, పండరి రవీందర్‌రావు, ఆకుల దేవేందర్, ఊడెం కృష్ణారెడ్డి, నాయిని యాదగిరి, తోట ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
9401 మంది విద్యార్థులకు 840 మంది గైర్హాజర్
జిల్లా ఇంటర్ పరీక్షల నోడల్ అధికారి డాక్టర్ నర్సింలు
మెదక్, మార్చి 3: మెదక్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియోట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రతి సెంటర్‌లో ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు మంచినీటి వసతులు కల్పించారు. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జర్నలిస్టులను పరీక్ష కేంద్రాల్లో ప్రవేశించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. శుక్రవారం ఇంగ్లీష్ మీడియం పరీక్షలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 9401 మంది అలాట్‌మెంట్ కాగా 8561 మంది పరీక్షలకు హాజరయ్యారు. 840 మంది పరీక్షలకు గైర్వాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఇంటర్ పరీక్షల నోడల్ అధికారి డాక్టర్ కె.నర్సింలు శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఎట్టకేలకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. గతంలో వేసవి కాలంలో జరిగిన ఇంటర్, 10వ తరగతి పరీక్షలకు స్వచ్చంద సంస్థలు మంచినీటి వసతులు, మజ్జిగలను ఏర్పాటు చేశారు. కానీ ఈ సంవత్సరం స్వచ్చంద సంస్థల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.