మెదక్

అణగారిన కులాల వారి ఆర్థిక స్వాలంబనతోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 26: అణగారిన కులాలు, వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వాలంబనతోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధనశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేసారు. గొర్రెకాపరులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, నాయిని బ్రాహ్మణులు తదితర వర్గాల సంక్షేమ నిమిత్తం పలు పథకాల రూపకల్పన అందులో భాగమే అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన ప్రకారం లక్ష్య సాధనలో నిర్దేశిత సమయం కంటే ముందుంటామన్నారు. ఆదివారం పటన్‌చెరు మండలం పాటి గ్రామ పంచాయతీ శివారులోని ఎస్‌విఆర్ గార్డెన్‌లో జరిగిన గొర్రెకాపరులు, మత్స్యకారుల సహకారం సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని మత్స్యకారులు, గొర్రెకాపరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో 84 లక్షల గొర్రెలు ఆయా కులాలకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. కేవలం 25 శాతం పైకం చెల్లిస్తే సరిపోతుందని, మిగితా 75 శాతం డబ్బులు సబ్సిడీగా అందిస్తామన్నారు. దళారులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ సొమ్ము చేరేలా పధకం రూపకల్పన చేయడం జరిగిందన్నారు. మత్సకారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా అత్యాధునికంగా 140 మార్కెట్లు మంజూరు చేసామని ప్రకటించారు. ప్రతి నియోజవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 119 బిసి గురుకుల పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గొర్రెకాపరులు, మత్స్యకారులు, వెనుకబడిన తరగతుల గురించి గత ప్రభుత్వాలు ఎన్నడూ మాట్లాడిన దాఖలాలు ఈ సంధర్బముగా ఆయన గుర్తుచేసారు. ఆర్థికంగా వారిని బలోపేతం చేసిన నాడే ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఫలితం దక్కుతుందని నమ్మిన కెసిఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వారి సంక్షేమానికే పెద్దపీట వేసారన్నారు. తల్లిలా సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు అడగకుండానే వేతనాలు పెంచిన కెసిఆర్ వారి ఆప్యాయతకు పాత్రులయ్యారన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు పూడికతీతకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భారీగా వర్షాలు కురవగానే 27 కోట్ల చేపపిల్లలు వదలడం జరిగిందన్నారు. పటన్‌చెరు పట్టణంలో మత్స్యకారుల సౌకర్యార్థం మార్కెట్ నిర్మించడానికి రూ50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పటన్‌చెరు, రామచంద్రాపురం పట్టణాలలో రెండు చిల్లింగ్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ యాదవులు. మత్స్యకారుల సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం ప్రత్యేకంగా పధకం రూపొందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రహదారులు, పలు సంక్షేమ పధకాలతో ఈరోజు కలకలలాడుతోందన్నారు. విమర్శకుల నోర్లు మూయించేల వినూత్న పధకాలకు రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధనకు అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు. మెదక్ ఎంఎల్‌సి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 45 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనతం కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించడం హర్షించదగిన పరిణామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపిపిలు శ్రీశైలం, యాదగిరి, రవీందర్‌రెడ్డి, జడ్పీటిసి రాములు, కార్పొరేటర్లు తొంటఅంజయ్య, సింధు ఆదర్శరెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళియాదవ్, పశు సంవర్ధకశాఖ అధికారులు లక్ష్మారెడ్డి, సువర్ణ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.