మెదక్

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, మార్చి 26: బోరునీరు ఒక్కసారిగా తగ్గిపోవడం... వేసిన పంట ఎండిపోతుండడం, నెలకింద కుమార్తె వివాహం చేయడంతో అప్పులు పెరగడంతో మానసిక క్షోభకు గురైన రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుబ్బాక మండలం హబ్సీపూర్‌లో ఆదివారం జరిగింది. దుబ్బాక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన తొక్కడగల్ల యాదయ్య(40) వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. పంటల కోసం 3బోర్లు వేయగా రెండు చుక్కనీరు రాలేదు, ఒకబోరులో నీరు వచ్చాయి. దీంతో వానలు బాగా పడడంతో నీరు బాగారావడంతో వరిపంట సాగుచేశాడు. పంట పొట్టదశలో ఉన్న సమయంలో బోరులో నీరు తగ్గిపోవడంతో నీరు అందలేదు.
అలాగే నెలకింద కుమార్తె శ్యామల వివాహం చేశాడు. పంటచేతికొస్తే అప్పులు తీర్చవచ్చనుకున్న యాదయ్య పంట ఎండిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైనాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన యాదయ్య చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య వజ్రవ్వ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
సిఎం దత్తత గ్రామంలో
వైద్యశిబిరం విజయవంతం

జగదేవ్‌పూర్, మార్చి 26: సామాజిక సేవలో రుక్కుస్ డెంటల్ వైద్యశాల తన వంతు సహాకారం అందిస్తుందని వైద్యులు సునీల్‌రెడ్డి తెలిపారు. రుక్కుస్ డెంటల్ 15వ, వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని సిఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించి రోగులకు ఉచితంగా పళ్ల సెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ సునీల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పేద ప్రజలకు తమ వైద్యశాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మారు మూల గ్రామాలను ఎంపిక చేసుకుని తాము ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రుక్కుస్ డెంటల్ హాస్పిటల్‌లో పలు ఆధునిక చికిత్సా పద్ధతుల ద్వారా చికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సింగిల్ సింట్టింగ్ రూట్‌కెనాల్ చికిత్స, లేజర్, రోటరీ పద్దతిలో ఎలాంటి నొప్పి, బాధ, రక్తసావం లేకుండా శాస్త్ర చికిత్సలు చేయనున్నట్లు వైద్యులు సునీల్ తెలిపారు. ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతం కావటంతో ఆయన సంతృప్తిని వ్యక్తం జేశారు. ఈ శిభిరంలో35 మందికి పళ్ల సేట్లు ఉచితంగా పంపిణీ జేశారు.
మున్సిపల్ పాలకవర్గం, అధికారులపై మంత్రి ఆగ్రహ్ఘం

సిద్దిపేట, మార్చి 26: సిద్దిపేటలోని ప్రధాన రోడ్లలో సక్రమంగా వీధి లైట్లు వెలుగకపోవడం, రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మించడం పట్ల మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి హరీష్‌రావు వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్ మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదని, చీకటిమయంగా ఉందని, ఇక్కడి కౌన్సిలర్ ఎవరని ప్రశ్నించారు. ఆర్డీఓ కార్యాలయం, ఆర్‌అండ్‌బి గెస్టుహౌజ్ ఉన్న ప్రాంతంలోనే వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదనిప్రశ్నించారు. ప్రధాన రోడ్లలో కొత్తగా ఇండ్లు నిర్మిస్తున్న వారు రోడ్లు ఆక్రమించి కడుతున్నారన్నారు. రోడ్లు ఇప్పటికే చిన్నగా ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా మారరా అని ప్రశ్నించారు. రోడ్డుకు 5్ఫట్ల సెట్‌బ్యాక్ పోవాల్సి ఉండగా 3,4్ఫట్లు ముందుకు వస్తున్నారని, ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిలర్ల డ్యూటీ సైతం తానే చేయాలా అని, తాను చేయమంటే చేస్తానని అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు శ్రద్ద తీసుకొని అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సెట్‌బ్యాక్‌లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఆర్డీఓ పాల్గొన్నారు.