మెదక్

నిర్వాసితులకు బతుకుతెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/తొగుట, మార్చి 31: పెద్దప్రాజెక్టుల పేరుతో ప్రజలను టిఆర్‌ఎస్ సర్కార్ మోసగిస్తుందని, కోట్లాది రూపాయలు ప్రజల పైభారం మోపే ఈ ప్రాజెక్టులు నిర్మించకుండా వాటర్‌షెడ్‌ల ద్వారా భూగర్భజలాలు పెంచవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జాతీయ విపత్తుల నివారణ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా మండలంలోని వేములగాట్‌లో 300రోజులకు చేరిన రిలేదీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. పెద్దప్రాజెక్టుల వల్ల ఎకరానికి 5లక్షల ఖర్చుతో పాటు కరంట్‌కోసం లక్ష అదనపు ఖర్చు అవుతుందన్నారు. వాటర్‌షెడ్ ద్వారా 5వేలు గతంలో ఎకరానికి అయ్యేదని, నేడు 7500ఖర్చుచేస్తే సరిపోతుందన్నారు. 3పంటలకు నీరందే ఉపాయం చూపిస్తామంటే వినకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి కమీషన్లతోఅక్రమంగా డబ్బు సంపాదించుకునేందుకు పెద్దప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. జలవనరుల నిపుణుడు హన్మంతరావు చూపిన వాటర్‌షెడ్‌ను అమలు చేసేలా ఒత్తిడి తెచ్చి ప్రజల పై భారం తగ్గించి రాజస్థాన్ తరహాలో భూగర్భజలాల పెంపుకు కృషి చేస్తామన్నారు. జహీరాబాద్ పరిసరాల్లో సైతం వాటర్‌షెడ్ అమలుతో భూగర్భజలాలు ఘననీయంగా పెరిగాయని, బావుల్లో నీరు చేతికందేలా చేరుకున్నాయన్నారు. అలాంటివాటిని కాదని ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చట్టాన్ని అతిక్రమించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తు ముందుకుసాగడం దారుణమన్నారు. న్యాయం కోసం వేములగాట్ వాసుల పోరాటం కొనసాగించాలని, తప్పకుండా విజయం వరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజలను ఒప్పించి ప్రాజెక్టులు కట్టాలి
సిఎం కెసిఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మాని ప్రజలను ఒప్పించి ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ రెండుకళ్ల ధోరణి మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయని మాట్లాడడం సమంజసం కాదన్నారు. మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్ కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలన్నారు. నిర్వాసితులకు న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
ఈ పోరాటం మరో చట్టానికి నాంది
నర్మదా బచావో, నందిగ్రామ్ ఉద్యమాల స్ఫూర్తితో వేములగాట్ పోరాటం దేశంలోనే ఆదర్శంగా నిలిచి మరో కొత్తచట్టానికి నాందిగా మారుతుందని టిపిఎఫ్ రాష్ట్ర నేత గాదె ఇన్నయ్య అన్నారు. నిర్వాసితులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం 2013చట్టం కాదని జిఓలతో భూసేకరణ చేపట్టిందన్నారు. గతంలో నర్మదా బచావో, నందిగ్రామ్ ఉద్యమాల వల్ల 2013చట్టం వచ్చిందన్నారు. నేడు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా వేములగాట్ వాసులు చేస్తున్న పోరాటం మరో కేంద్ర చట్టానికి నాందిగా నిలవడం ఖాయమన్నారు.
బతుకుదెరువు చూపి ప్రాజెక్టులు కట్టాలి
బూనిర్వాసితులకు చట్టప్రకారం బతుకుదెరువు చూపి ప్రాజెక్టులు కట్టాల్సిందిపోయి ప్రజల మధ్య లొల్లి పెట్టి మరోసారి మోసగించేందుకు కెసిఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 28పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించాల్సిన టిఆర్‌ఎస్ సర్కార్ వాటిని విస్మరించి కోట్లాది రూపాయలు పెంచి రీడిజైనింగ్ పేరుతో కొత్తప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి నేడు మంత్రి పదవులు కట్టపెట్టారని, ఉద్యమంలో పాల్గొన్నవారిని విస్మరించారన్నారు. వేములగాట్ ప్రజలు తెలంగాణ ఏర్పాటు కోసం ముందుండి పోరాడారని, వారిని ఇక్కట్లకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే దాకా టిడిపి అండగా ఉండి పోరాటంలో ముందుంటుందన్నారు.
దేశవ్యాప్తంగా వేములగాట్ పోరాటం ప్రసిద్దికెక్కింది
పట్టినపట్టు వదలకుండా ఐక్యంగా వేములగాట్ ప్రజలు తమ గ్రామాన్ని, భూములను కాపాడుకునేందుకు చేపట్టిన దీక్షలు300రోజులకు చేరుకోవడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి అన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేములగాట్‌వాసుల పోరాటం ప్రసిద్దికెక్కిందన్నారు. ఏ రాష్ట్రంలో భూసేకరణ చేసినా వేములగాట్ ప్రజల పోరాటమే చర్చనీయాంశంగా మారిందన్నారు. డిజైన్ మార్చి కొత్త సొగసులు పులిమి కోట్ల రూపాయలు పెంచి ప్రజలకు కష్టాలు కలిగించి కెసిఆర్ కుటుంబం సుఖాలు అనుభవిస్తుందని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజించు, పాలించు అనేది దొరల నైజమని, అదే తరహాలో కెసిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి ఉన్నవారు దూరమైనారని, వ్యతిరేకులను దగ్గరికి చేర్చుకొని మంత్రిపదవులు ఇచ్చి అందలమెక్కించిన ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. న్యాయం కోసం చేస్తున్న వేములగాట్ నిర్వాసితుల పోరాటానికి ప్రజాసంఘాలు, పార్టీలతో కలిసి న్యాయం జరిగే దాకా మద్దతుగా పోరాటం చేస్తామన్నారు.ఇంకా న్యాయవాది రచనారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కొందండరెడ్డి, ప్రొ.పురుషోత్తం, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మినారాయణ, మహిళ రైతుసంఘం నాయకురాలు పద్మ, సిసిసి కోఆర్డీనేటర్ సజయ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు భాస్కర్, మల్లారెడ్డి, జెఎసి నేతలు హయతుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రంగారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6లోపు టిఆర్‌ఎస్ గ్రామ, మండల కమిటీల నియామకం

* నాయకులకు
ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ సూచన
* ఉద్యమంలా సాగుతున్న
సభ్యత్వ నమోదు
* పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపు
సంగారెడ్డి టౌన్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసిన ఉద్యమంలా టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని 25,29 వార్డులో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని సభ్యులకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి సభ్వత్వ నమోదును చేయించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 6లోపు గ్రామ, వార్డు కమిటీలు, 12లోపు మండల కమిటీలను పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ కమిటీలు వేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 21న రాష్ట్ర ప్లినరి నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్లినరిలో పలు తీర్మాణాలు కూడా చేయడం జరుగుతుందన్నారు. 27న వరంగల్‌లో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బహిరంగ సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.