మెదక్

నవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, ఏప్రిల్ 4: ఎతె్తైన కొండలమీద వెలసిన లక్ష్మీరంగనాయకస్వామి శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసుకొని ముస్తాబైంది. ఎంతో పురాతన చరిత్రగల ఈ ఆలయం యేటా శ్రీరామనవమి పర్వదినాన కల్యాణోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా కొండమీద వెలసిన లక్ష్మిరంగనాయకస్వామి కల్యాణోత్సవానికి మంత్రి హరీష్‌రావు చొరవతో 98లక్షలతో కొండమీదికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రోడ్డు పూరె్తై ప్రజలకు సౌకర్యంగా మారింది. సిద్దిపేట జిల్లాతో పాటు సిరిసిల్లజిల్లాకు చెందిన ప్రజలు పాల్గొని స్వామికి పూజలు నిర్వహిస్తు మొక్కులు నెరవేర్చుకుంటారు. శ్రావణమాసంలో స్వామిసన్నిధిలో వనభోజనాలు చేస్తు స్వామికి పూజలు చేస్తుంటారు. ఆలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తు పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ సహకారంతో మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా కల్యాణ మండపానికి శంఖుస్థాపన చేయనున్నారు. కల్యాణం తిలకించేందుకు మంత్రి హాజరుకానుండడంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కల్యాణం సందర్భంగా అన్నదానం చేయనున్నారు. వైశాఖపౌర్ణమి నాడు స్వామి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తొగుటలో..
తొగుట : మండలంలోని తొగుట రామునిగుట్ట, తుక్కాపూర్ సీతారామాంజనేయ స్వామి ఆలయాలు సీతారాముల కళ్యాణోత్సవాలకు ముస్తాబైనాయి. ప్రతి ఏటా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ ఆలయాల్లో నిర్వహించే సీతారామ కళ్యాణోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగానే వస్తుంది. ఇందుకోసం నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంధులు కలుగకుండా పచ్చని పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు.

సదరమ్ శిబిరం విజయవంతం

మెదక్, ఏప్రిల్ 4: శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఉన్న సంరక్షణ ఆశ్రమం నుంచి మంగళవారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో జరిగిన సదరం శిబిరానికి 27 మంది మానసిక వికలాంగులను తరలించుకొని వచ్చారు. సంరక్షణ ఆశ్రమం డైరెక్టర్ సజ్జీ వలంటీర్లు వారితో పాటు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ వీరి పట్ల చాలా శ్రద్ధవహించారు. ప్రభుత్వ పరంగా మానసిక వికలాంగులకు సర్ట్ఫికెట్లు ఇస్తే వారికి ప్రభుత్వపరంగా వచ్చే సంక్షేమ పథకాలలో లబ్దిచేకూరుతుందని తెలిపారు. దొంతి సంరక్షణ పథకంలో ఉంటున్న 72 మంది అనాథల కోసం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్లినిక్ కోసం అదనంగా స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు. ఎంపిటిసి సత్యనారాయణ సహకారం కూడా చాలా ఉందని తెలిపారు. కాగా మెదక్‌లో ఏర్పాటు చేసిన సదరం క్యాంప్‌నకు 27 మంది మానసిక వికలాంగులు చేరుకోగా వారిని మానసిక వైద్యురాలు డాక్టర్ వీరజ పరీక్షించారు. అక్కడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ ఉన్నారు. అంతకు ముందు బిజెపి జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు 27 మంది మానసిక వికలాంగులకు మజ్జిగను సరఫరా చేశారు. మెదక్ ఏరియా ఆస్పత్రి నుంచి మంచినీటి వసతి, ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లను అందజేశారు. డిఆర్‌డిఎ అధికారి జాన్‌కిరణ్ సేవలు అందజేశారు. 2014లో శివ్వంపేట మండలం దొంతిలో మానసిక రోగులకు, ఆనాథ పిల్లలకు సంరక్షణ కేంద్రం ప్రారంభించినట్లు డైరెక్టర్ సజ్జీ తెలిపారు. ఈ సేవా కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. మానసిక వికలాంగులకు క్రమశిక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను వివరించారు. మాటలు రాకపోయినా వలంటీర్లు చెప్పినట్లుగా మానసిక వికలాంగులు నడుచుకోవడం కనిపించింది. డైరెక్టర్ సజ్జీ మానసిక వికలాంగులకు మజ్జిగ ప్యాకెట్లను విప్పి స్వయంగా తాగించడం కనిపించింది.