మెదక్

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నందిని సిధారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 2: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంకు చెందిన ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులు జారిచేశారు. సిద్దిపేట డిగ్రి కళాశాలలో విద్యాభ్యాసం చేసిన సిధారెడ్డి అదే కళశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. సాహిత్యంపైన మక్కువ ఉన్న సిధారెడ్డి ఎన్నో కథలు, పాటలు, పుస్తకాలు రచించారు. సిద్దిపేటలో ఆయన మంజీర రచయితల సంఘంను స్థాపించి సాహిత్య రంగం అభివృద్ధికి కృషిచేశాడు. భూమిస్వప్నం, ప్రాణహిత, సంభాషణ, ఒక బాధకాదు లాంటి పుస్తకాలను రచించాడు. ఆయన వ్రాసిన పుస్తకాలకు సాహిత్య సంస్థలు అవార్డులు సైతం ప్రకటించాయి. సిధారెడ్డి రచించిన ననాగేటి సాళ్లల్ల నా తెలంగాణ, వీరులకు జోహార్లు - అమరులకు జోహార్లు లాంటి పాటలు వీర తెలంగాణ సినిమాలో వాడుకోవడంతో రాష్టవ్య్రాప్తంగా మంచి ప్రాచుర్యం లభించింది. కాగా నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ పాటకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. నందిని సిధారెడ్డికి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌గా పదవి రావడం పట్ల సాహిత్య అభిమానలు, మరసం, తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట మండల పాఠశాలల్లో
వంటశాలలకు రూ.25లక్షలు మంజూరు
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, మే 2 : నియోజక వర్గంలోని సిద్దిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మోడల్ కిచెన్ షెడ్ల నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వౌళిక వసతులు కల్పించేందుకు గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్నాం భోజనం వంట చేసేందుకు ఇబ్బందిగా ఉండటంతో మోడల్ కిచెన్ షెడ్ నిర్మించనున్నట్లు తెలిపారు. కిచెన్ షెడ్‌తో పాటు స్టోర్ రూం నిర్మించనున్నట్లు తెలిపారు. రాఘవాపూర్, బక్రిచెప్యాల ఉన్నత పాఠశాలల్లో కిచెన్‌షెడ్ నిర్మాణానికి 2.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దమ్మన్నగారి గూడేం, బూర్గుపల్లి లోని రాంచంద్రానగర్, లక్ష్మిదేవిపల్లి, లింగారెడ్డిపల్లి, మిట్టపల్లి, బచ్చాయిపల్లి, రావురుకుల, రాంపూర్, ఎల్లుపల్లి, తోర్నాలలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో కిచెన్ షెడ్లకు 2లక్షల చొప్పున మంజూరైనట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోగా నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్లను అందుబాటులోకి తీసుకరానున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, విద్యాకమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు చొరవ చూపి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.