మెదక్

జహీరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షబానాబేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, మే 16: జహీరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన షబానాబేగం ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన షబానాబేగంకు అభ్యర్థిత్వానికి 16మంది మద్దతు తెలుపుతూ చేతులెత్తారు. 27మంది సభ్యులున్న మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అభ్యర్థికి కేవలం 14మంది సభ్యుల మద్దతు మాత్రమే అవసరం. 16 మంది మద్దతు తెలపడంతో ఆమె ఎన్నికైనట్లు ఎన్నికల అధికార అబ్దుల్ హమీద్ ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్‌పర్సన్ తనకు మద్దతుపలికి, తనకు పదవి కట్టబెట్టిన ఎంపి బిబి.పాటిల్, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్దీన్, మాజీ చైర్‌పర్సన్ లావణ్యలతోపాటు ప్రతి ఒక్క సభ్యుడికి అమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన భర్త తంజిమ్, పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ భవనంపైనుంచి స్థానికులు, మద్దతు దారులకు చేయి ఊపి అభివాదం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి నెలరోజుల కిందట లావణ్య రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అమె స్థాలంలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి షబానాబేగం చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. వాస్తవానికి 15వతేదీన ఈ ఎన్నికలను నిర్వహించినా కోరం లేకపోవడంతో వాయిదాపడ్డ ఈ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎంపి బిబి.పాటిల్, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్దీన్ 24మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. జహీరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన షబానాబేగంకు స్థానిక నాయకులు, ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
విజయోత్సవ ర్యాలీ
చైర్‌పర్సన్‌గా ఎన్నికైన షబానాబేగం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎంపి, ఎమ్మెల్సీ ఇతర మార్కెట్ కమిటీ, సిడిసి చైర్మన్‌లు లక్ష్మారెడ్డి, ఉమాకాంత్‌పాటిల్, ఆత్మాచైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి గంజ్ మార్కెట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. అక్కడికి చేరుకుని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్‌కు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీకి, నాయకులకు జేజేలు పలికారు.
భారీ బందోబస్తు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్నిపల్ కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల కేంద్రం నుంచి సుమారు 200ల మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు. సభ్యులు మినహా ఎవరినికూడా కార్యాలయం అవరణలోకి అనుమతించలేదు. ఈ బందోబస్తుపై ఎమ్మెల్యే గీతారెడ్డి స్పందిస్తూ నిన్న ఎందుకు ఏర్పాటుచేయలేదని డిఎస్పీ నల్లమలరవిని అడిగారు. ముందు జాగ్రత తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేదికాదన్నారు. మీ చర్యలతో తమకు చాలా నష్టం వాటిల్లిందని పలువులు కౌన్సిలర్లు ఆక్రోశం వెళ్లగక్కారు.
మున్సిల్ కార్యాలయం ముందు విలేఖరుల నిరసన
చైర్మన్ ఎన్నికలకు మీడియాను అనుమతించక పోవడంతో విలేఖరుల అధికారి తీరుపై విస్మయం వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. ఎన్నికల అధికారి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అర్డీఓ ఇలాంటి తప్పులు ఇకముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామనడంతో విలేఖరులు ఆందోళన విరమించారు.

రైతన్న వెన్ను విరుస్తున్న ప్రభుత్వం!
* ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా లక్ష్మారెడ్డి
ములుగు, మే 16: రైతుల పేరు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అదే రైతులకు సంకెళ్ళు వేసి బోనులో నిలబెట్టారని, ఈ పద్ధతి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎంత వరకు సమంజసమని ఉమ్మడి జిల్లాల డిసిసి అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాపూర్, కొక్కొండ గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక లాంటివారని అలాంటి రైతు వెన్ను విరుస్తున్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. 3 సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా, కెజి టు పిజి ఉచిత చదువును అమలు చేశారా, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారా, ఇండ్లులేని పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ఇచ్చారా, పంటలు మద్దతు దర ఏది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు చేతగాక మాపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు ఏం చేస్తారని మోసపూరిత మాటలతో కాలం ఎల్లదీస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటనష్ట పరిహారం నిదులను ఒకే సారి ఇచ్చినా రైతులకు మాత్రం ఇప్పటి వరకు రెండు సార్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రుణమాఫీని కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకే సారి చెల్లించగా, ఈ ప్రభుత్వం మాత్రం 4 సార్లు ఇవ్వడంతో రైతులు తిరిగి ప్రైవేటు అప్పులు చేశారని ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికి ఆ కుటుంబాలను పరామర్శించకుండా తప్పుడు నివేదికలు చెల్లించుకొని తప్పించుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కులాలవారిగా ప్రజలను విడదీస్తూ వారి మద్య విబేదాలను సృష్టిస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అనంతరం కొక్కొండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్, టిడిపి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలతో ఎల్లవేలలా అండగా ఉంటానని ఎవ్వరికి బయపడకుండా పార్టీ అభివృద్దికి తోడ్పడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి సంతోష్‌రెడ్డి, ములుగు ఎంపిపి అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, రాష్ట్ర యువత విభాగం కార్యదర్శి సర్దార్‌ఖాన్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి రామరాజ్ పంతులు, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ములుగు, వర్గల్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, నాయకులు నర్సింహాచారి, నర్సింలు, సాయినాథ్‌గౌడ్, నర్సింహారెడ్డి, మహిపాల్ రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ మొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.