మెదక్

రైతన్నది అదే దైన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, మే 16. చిలప్‌చెడ్ మండలం పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. అగ్రహించిన రైతులు మంగళవారం నాడు చిట్కుల్ గేట్ వద్ద జోగిపేట - మెదక్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజులకు ఓక లోడు లారీ ధాన్యం మాత్రమే రవాణా చేస్తున్నారని అన్నారు. రోజుల తరబడి రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాయాల్సి వస్తోందని, ధాన్యం ఎండపోయడానికి టాపర్లను కిరాయికి తెచ్చుకుంటున్నామని, రోజుకు ఓక టాపర్‌కు 20 రుపాయల చొప్పున కిరాయి చెల్లిస్తున్నామని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రారోంభోత్సవాలపై కనబర్చిన శ్రద్ధ ధాన్యం కొనుగోలు జరపడంలో వారికి చిత్తశుద్ధి లేదని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేవని, ఓపక్క ఆకాశం రోజు మేఘాలతో కమ్ముకుని, అకాల వర్షాలు పడుతున్నాయని ధాన్యం ఏమైపోతుందనే భయంతో బిక్కు బిక్కుమంటూ రోజులు గడుపుతున్నామని రైతులు తమ గోడును వెల్లడించారు. అరుగాలం శ్రమించి, ఎన్నో కష్టాలు పడి వరి ధాన్యంను పండిస్తే చివరికి కన్నీళ్లు మిగిలాయని రైతులు అందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులపై ఇంత నిర్లక్ష్యమా అని అవేదన వ్యక్తం చేశారు. అధికారులకు రైతులపై కనికరం లేదని, రైతులంటే చిన్నచూపా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయని, కేంద్రం వద్ద సుమారు 30 లారీల వరి ధాన్యం నిల్వలు ఉన్నాయని, నిర్వాహకులు సరిగా ధాన్యం కొనుగోళ్లు జరపడంలేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యంను తరలించకపోవడంతో భారీగా ధాన్యం నిల్వలు పేరుకపోయాయని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. లారీల సమస్యను తీర్చి ధాన్యం బస్తాలు తరలించే వరకు ఆందోళనలు చేపడుతామని రైతులు హెచ్చరించారు. రైతులకు మద్దతుగా సోసైటీ డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి, గౌతాపూర్ ఉపసర్పంచ్ భీమయ్య, మాజీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, నాయకులు మల్లారెడ్డి, రాంరెడ్డి మద్దతు తెలిపారు. చిట్కుల్ గ్రామానికి చెందిన రైతులు భారీగా రాస్తారోకోలో పాల్గొన్నారు.
అధ్యాపకుడి ఆగడాలతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
* రత్నపురి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం
* ఆత్మహత్యకు యత్నించి అవిటిదైన శిరీష
* యాజమాన్యాన్ని నిలదీసిన బంధువులు
* పోలీసులకు పిర్యాదు
హత్నూర, మే 16: విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను విస్మరించి వ్యక్తిగత కక్ష సాధింపునకు దిగిన ఓ బోధకుడు ఒక విద్యార్థి భవిషత్తుకే అవిటితనాన్ని తీసుకువచ్చిన ఉదంతం తల్లిదండ్రులు, బంధువుల నిలదీతతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామ శివారులో ఉన్న రత్నపురి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం వర్ని గ్రామానికి చెందిన శిరీష ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిర్వహించిన కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడల్లో శిరీష సరిగ్గా రాణించలేకపోయింది. దీంతో ఉపాధ్యాయుడు యాకూబ్ శిరీషను మందలించడంతో స్పందించి తనకు క్రీడలంటే ఇష్టం లేవని, తనను మందలించాల్సిన అవసరం లేదని బదులు సమాధానం ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు యాకూబ్ వ్యక్తిగత కక్షను పెంచుకుని కళాశాలలో తరుచుగా డబ్బులు మాయం అవుతున్నాయని, నీవే దొంగిలిస్తున్నావంటూ వేధింపులకు గురి చేసాడు. తీవ్రంగా మనస్తాపం చెందిన శిరీష్ ఏప్రిల్ 27వ తేదీన కళాశాల రెండవ అంతస్తు నుంచి క్రిందకు దూకి ఆత్మహత్యకు విఫలయత్నం చేసింది. ఈ ఘటనలో శిరీష ఒక కాలు రెండు చోట్ల విరిగిపోగా వెన్నుపూస కూడా విరిగింది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శిరీషను ఇంటికి తరలించింది. చికిత్స చేయించినా శిరీష కూర్చునే పరిస్థితిలో లేకుండా మంచానికే పరిమితమైంది. మంగళవారం నాడు శిరీష తండ్రి సాయిబాబాతో పాటు ఇతర బంధువులు కళాశాల వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తూ ఘెరావ్ చేసారు. కళాశాల పరిపాలన అధికారి బిక్షపతితో చర్చించి తమ కూతురుకు న్యాయం చేయాలని, ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాయించాలని, ఆసుపత్రికి అయిన ఖర్చులను భరించాలని, వచ్చే యేడాది చదువులు కూడా చెప్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు. తమ కూతురు అంగవైకల్యానికి కారణమైన ఉపాధ్యాయుడు యాకూబ్‌ను కళాశాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళతానని పరిపాలనాధికారి భిక్షపతి హామీ ఇచ్చారు. అనంతరం హత్నూర పోలీసు స్టేషన్‌కు వెళ్లి కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి సాయిబాబా పిర్యాదు చేసారు.