మెదక్

కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతోనే చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 14 : కంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనలే సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో ఇద్దరు చిన్నారులు బలైనారని సీనియర్ కాంగ్రెస్ నేత, సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కాళ్లకుంట కాలనీలో కరీంబేగ్ కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వైఖరి స్పష్టంగా కన్పిస్తుందన్నారు. రెండు నెలలుగా లోతైన కాల్వలు తీసి అలాలే వదిలేవేశారన్నారు. ఇంతవరకు పైపులైన్లు వేయలేదన్నారు. వర్షం నీరుతో కాల్వలు నిండి ఉండటం వల్ల చిన్నారులు షబనాభేగం, జోయాభేగంలులు భగీరథ గుంతలో పడి మృతిచెందినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని ఆర్‌డబ్లుఎస్ అధికారులను, వారిని అడిగితే తమకు సంబంధం లేనట్లుగా తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. కాళ్లకుంట వార్డు పరిధిలో మున్సిపల్ కౌన్సిలర్ సైతం తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్‌లో ఉండి కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. రాజకీయాలకు అన్ని పార్టీలను కలుపుకొని బాధిత కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ చాంద్, వంగరి నాగరాజు, గూడూరి నాగరాజు, డిసిసి మైనార్టీ సెల్ నేత విహీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

21నుంచి టిజెఎసి అమరుల స్ఫూర్తి యాత్ర

సంగారెడ్డి టౌన్, జూన్ 14: ఈ నెల 21నుండి 24వరకు టిజెఎసి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్రను నిర్వహించనున్నట్లు టిజెఎసి రాష్ట్ర కోకన్వీనర్ పురుషోత్తం పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాత్రలో టిజెఎసి చైర్మన్ కోదండరాం పాల్గొని అమరుల కుటుంబాలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులను కలిసి ప్రభుత్వ వ్యతిరేకతపై అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందన్నారు. తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలో నిర్వహించే స్ఫూర్తియాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూ కుంభకోణాలపై హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 31జిల్లాలో కొనసాగిస్తామన్నారు. అనంతరం స్ఫూర్తియాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో టిజెఎసి నాయకులు అశోక్‌కుమార్, బీరయ్యయాదవ్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, ఇంతియాస్, వజీర్‌బేగ్, మల్లయ్య, ఫృద్విరాజ్, తుల్జారెడ్డి, నారాయణ, రాహుల్, మురళీ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు: మంత్రి హరీష్
బాధ్యులెవరైనా కఠినంగా శిక్షిస్తామని భరోసా
సిద్దిపేట, జూన్ 14: కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పై మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని, ఎస్‌ఐ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలు పరిరక్షించి ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు మనోస్థైర్యం కోల్పోవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవాలని అక్కడ సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. పోలీసులకు రక్షణగా ఉండే తుఫాకీతో తమ ప్రాణాలు తీసుకుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. సంఘటన పై విచారణ జరిపించి దోషులెవరైనా చర్యలు తీసుకుంటామన్నారు.

బాసులొచ్చారు
సిద్దిపేట/ కొండపాక, జూన్ 14: కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య సంఘటన పై అడ్షినల్ డిజి గోపికృష్ణ, ఐజి స్టిఫేన్ రవీంద్ర, డిఐజి శివశంకర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీస్‌క్వార్టర్‌లో ఎస్‌ఐ ఆత్మహత్య ఘటనను వారు పరిశీలించారు. సంఘటన స్థలం వద్ద పరిస్థితి ఉధృతంగా ఉండడం వల్ల పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఉన్నతాధికారులు పోలీసు క్వార్టర్‌ను పరిశీలించారు. ఆత్మహత్య పై సిపి శివకుమార్, ఏసిపి గిరిధర్‌తో చర్చించారు. ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న భార్య, తల్లిదండ్రులు
ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి భార్య రచన, తల్లిదండ్రులు రాంరెడ్డి, వెంకటమ్మలు బుధవారం రాత్రి 8.30గం.కు కుకునూరుపల్లికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఎస్‌ఐ కుటుంబీకులను కారులోనే పోలీస్‌స్టేషన్ క్వార్టర్లకు తీసుకపోయారు. మీడియా రాకుండా లోపలికి తీసుకపోయారు. కుటుంబ సభ్యులు రచన, రాంరెడ్డి, వెంకటమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు నోరువిప్తేనే ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలు కొంతవరకైనా తెలిసి ఉండేవి. ప్రస్తుతం వారు మాట్లాడే పరిస్థితి లేకపోవడం వల్ల కారణాలు మిస్టరీగా మిగిలాయి. మృతదేహాన్ని గజ్వేల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన రాంరెడ్డి, వెంకటమ్మల కుమారుడు ప్రభాకర్‌రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆలేరులోని రామకృష్ణ విద్యాలయంలో టెన్త్ చదివి 2000సంవత్సరంలో జనగాంలో ఇంటర్, భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో ఎస్‌ఐగా జాయినైనాడు. షామీర్‌పేటలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి మెదక్ జిల్లా కౌడిపల్లి విధులు నిర్వహించి గత ఆగస్టులో కుకునూరుపల్లి ఎస్‌ఐగా బదిలీపై వచ్చాడు. సుమారు 10నెలలపాటు పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐకి భార్య రచన, 4నెలల బాబు ఉన్నాడు.

ఎస్‌ఐ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ

* బిజెపి డిమాండ్
సిద్దిపేట, జూన్ 14: కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులకే రక్షణ కరువైందన్నారు. అధికారుల వేధింపుల వల్లే ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వేధిస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహించే జిల్లా అని, సిఎం జిల్లాలోనే ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఈ సంఘటనల పై మంత్రి హరీష్‌రావు స్పందించాలన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఎస్‌ఐ ఆత్మహత్య ఉధంతంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలన్నారు. పోలీసుల వరుస ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం పై విశ్వాసం పోతుందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటన పై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల పట్ల నిబద్ధత ఉన్నవారే ప్రయత్నించాలి
*పట్టుదల, క్రమశిక్షణతో కృషిచేసి ఉద్యోగాలను పొందాలి
* కెరీర్‌ను సీరియస్‌గా తీసుకునేవారు కోచింగ్‌కు రావాలి
* మంత్రి హరీష్‌రావు హితవు
సిద్దిపేట, జూన్ 14 : తెలంగాణ ఉద్యమంలో ముందువరలో నిలిచిన సిద్దిపేట ఉద్యోగ రంగాల్లో ముందువరసలో నిలవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా పత్తి మార్కెట్ యార్డులో టెట్ ఉచిత కోచింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కానిస్టేబుల్ శిక్షణ శిబిరం నుంచి 66 మంది ఎంపికైనారని,(మిగతా 3వ పేజీలో) గ్రూపు-2 శిక్షణలో మంచి ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. టెట్ శిక్షణలో సైతం విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఉత్తమ ఫ్యాకల్టీతో నాణ్యమైన కోచింగ్‌ను ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా శిక్షణ అంటే సహాజంగా చిన్న చూపు ఉంటుందని సీరియస్‌గా తీసుకొని పట్టుదల, క్రమశిక్షణతో చదివేవారు మాత్రమే కోచింగ్ రావాలని, టైం పాస్ కోసం వచ్చే వారు అవసరం లేదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. వరుసుగా రెండు రోజులు గైర్హాజరైన వారిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. బిఇడి, టిటిసి పాస్ అయిన వారు తప్పసిసరిగా టెట్ ఉత్తిర్ణత సాధించాలని, పాస్ అయితేనే బిఇడికి గుర్తింపు అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా బోధించాలన్న టెట్ ఉత్తీర్ణత తప్పనిసరన్నారు. టెట్ శిక్షణ తీసుకున్న వారికి నాణ్యమైన స్టడీ మెటిరియల్ ఉచితంగా అందచేయనున్నట్లు పేర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించి సిద్దిపేటను రాష్ట్రంలో నెంబర్‌గా నిలుపాలని ఆకాంక్షించారు. పిల్లలు చక్కగా చదువుకొని ప్రయోజకులై సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటే తల్లిదండ్రులకు ఏంతో సంతోషం ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఏవైన సమస్యలున్న తన దృష్టికి తీసుకవస్తే పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. టెట్ కోచింగ్ తీసుకునే వారికి మధ్యాహ్నాం బోజనం అందచేయనున్నట్లు పేర్కొన్నారు. ఉచితంగా కోచింగ్ 800 మందికి పైగా రావటం మంత్రి హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేస్తు, ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని రంగాల్లో ముందుండి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగరంగాల్లో ముందు నిలువాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో శిక్షకులు జగదీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, కార్యదర్శి శ్రీనివాస్, పరమేశ్వర్, పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.